ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్​ను ఇంటికి పంపిస్తేనే గ్రామ పంచాయతీలకు న్యాయం: సర్పంచుల సంఘం - కలెక్టరేట్ వద్ద సర్పంచ్‌ల నిరసన

Sarpanches Protest For Solve The Demands at Collectorate: సర్పంచుల న్యాయమైన 16 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ నేతలు విజయనగరం కలెక్టరేట్​ వద్ద ధర్నా నిర్వహించారు. గల్లీ నుంచి దిల్లీ వరకు ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం స్పందించట్లేదని మండిపడుతున్నారు. డిమాండ్లను జగన్​ సర్కార్​ పరిష్కరించకపోతే ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఛాంబర్‌ నేతలు హెచ్చరించారు.

Sarpanches Protest For Solve The Demands at Collectorate
Sarpanches Protest For Solve The Demands at Collectorate

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 5:09 PM IST

సీఎం జగన్​ను ఇంటికి పంపిస్తేనే గ్రామ పంచాయతీలకు న్యాయం: సర్పంచుల సంఘం

Sarpanches Protest For Solve the Demands at Collectorate:సీఎం జగన్‌ ఇంటికి వెళ్తేనే గ్రామ పంచాయతీలకు న్యాయం జరుగుతుందని సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ నేతలు అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరతూ విజయగరం కలెక్టరేట్‌ ఎదుట సర్పంచులు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్ఓ అనితకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీలకు తీరని ద్రోహం చేసిందని పంచాయతీరాజ్ ఛాంబర్ చైర్మన్ బీవీ. రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోగా, గ్రామాలు శిథిలమై పోతున్నాయని రాజేంద్ర ప్రసాద్​ మండిపడ్డారు. గల్లీ నుంచి దిల్లీ వరకు ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం స్పందించట్లేదని మండిపడుతున్నారు.

'పోరాటాలు పట్టించుకోలేదు - వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలి'

YCP Government Not Release The Funds: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పల్లెల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువగా పెరిగిపోతున్నాయని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీలకు నిధులు ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను వైసీపీ ప్రభుత్వం హైజాక్​ చేసిందని మండిపడుతున్నారు. ఉపాధి హామీ నిధులు రూ.36 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దారి మళ్లించి తన సొంత అవసరాలకు ప్రభుత్వం వాడుకుంటుందని ఎద్దేవా చేశారు. గ్రామీణ అభివృద్ధి అంటే జగన్​కు ఏ మాత్రం పట్టించుకోవటం లేదని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్​ల అధికారాలను తొలగించి సచివాలయాలకు ఇవ్వడమనేది రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమని దుయ్యబట్టారు.

వచ్చే ఎన్నికల్లో జగన్​ను ఓడించాలి - ఏపీ సర్పంచుల సంఘం తీర్మానం

Sarpanchs Became Worthless During the YCP Government:రాష్ట్రంలోని 12,918 గ్రామాల్లోని మూడు కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన వాటా నిధులు ఇవ్వకపోగా, స్థానిక ఆదాయ వనరుల ద్వారా వచ్చే నిధులను, కేంద్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం విడుదల చేసేలా వాటిని సొంత అవసరాలకు వినియోగిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ధోరణికి నిరసనగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గత మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.

రాజ్యాంగబద్దంగా ఎన్నికైన సర్పంచ్​లకు వైసీపీ ప్రభుత్వ హయాంలో విలువ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వాలంటీర్​కు ఉన్న విలువ సర్పంచ్​లకు లేకుండా సీఎం జగన్ చేశారని మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, సర్పంచ్​లను ఉత్సవ విగ్రహలుగా మర్చారని విమర్శించారు. సీఎం జగన్ మాట్లాడితే ప్రజల ప్రక్షాన అంటారు కానీ ఆయనకు వాలంటీర్​ వ్యవస్థే ముఖ్యమని సర్పంచులు మండిపడుతున్నారు. తమ న్యాయమైన 16 డిమాండ్లను జగన్​ సర్కార్​ పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ నేతలు హెచ్చరించారు.

'జగన్‌ను ఓడిస్తేనే సర్పంచులకు మనుగడ'- విజయవాడలో ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ సమావేశం

ABOUT THE AUTHOR

...view details