Jessy Raj Got PMRBP 2025 : అంతర్జాతీయ స్కేటింగ్ వేదికపై గుంటూరు జిల్లాలోని మంగళగిరి క్రీడాకారిణి మాత్రపు జెస్సీరాజ్‌ను రాణిస్తోంది. ఈ క్రమంలోనే ఆ అమ్మాయిని ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం వరించింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2025కి జెస్సీరాజ్ ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఏటా వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 25 మంది చిన్నారులకు కేంద్రం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. తాజాగా ఆ జాబితాను ఇటీవల కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
14 సంవత్సరాల జెస్సీరాజ్ విజయవాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తన 9వ ఏట నుంచి స్కేటింగ్‌లో శిక్షణ తీసుకుంటుంది. తల్లిదండ్రులు రాధ, సురేష్ ప్రోత్సాహం, కోచ్ సింహాద్రి సూచనలతో ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తోంది. అలా 50 పతకాలు, బహుమతులను సాధించింది. ఈ సంవత్సరం జూన్‌లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన పోటీల్లో ఇన్‌లైన్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించి సత్తా చాటింది. దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ నెల 26న పురస్కారం అందుకోనున్నట్లు ఆమె తండ్రి సురేష్ వివరించారు.
స్కేటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్రధానమంత్రి బాలపురస్కార్ 2025 అవార్డును అందుకున్న జెస్సీరాజ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అంకితభావం, పట్టుదలతో ఈ ప్రతిష్టాత్మకు అవార్డును జెస్సీరాజ్ కైవసం చేసుకున్నందుకు గర్వపడుతున్నాను. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను… pic.twitter.com/YMUnSy6FmT
— Lokesh Nara (@naralokesh) December 20, 2024
Jessy Raj Excelling in Skating : స్కేటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్రధానమంత్రి బాల పురస్కార్- 2025 అవార్డుకు ఎంపికైన జెస్సీరాజ్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. అంకితభావం, పట్టుదలతో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. భవిష్యత్లో తను మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆమె చేస్తున్న కృషికి నిరంతరం మద్దతుగా నిలుస్తానని వెల్లడించారు. అన్నివిధాల సహాయ, సహకారం అందిస్తానని ఎక్స్ వేదికగా లోకేశ్ పేర్కొన్నారు.
రోడ్డుపైనే సాధన - విమర్శలు లెక్క చేయకుండా పతకాల పంట - Extensive Skills in Roller Skating