ETV Bharat / state

నేటి నుంచి 25 వరకు భవానీల విరమణ దీక్షలు- ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు - BHAVANIS DEEKSHA VIRAMANA

రెండు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భవానీల రాకతో కిటకిటలాడనున్న ఇంద్రకీలాద్రి

bhavanis_initiation_ceremony_at_vijayawada_kanaka_durga_temple
bhavanis_initiation_ceremony_at_vijayawada_kanaka_durga_temple (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Bhavanis Initiation Ceremony At Vijayawada Kanaka durga Temple : నేటి (డిసెంబరు 21) నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీల విరమణ దీక్షలు ఆరంభం కానున్నాయి. నుంచి 25 వరకు ఐదు రోజులు జరిగే భవానీ దీక్ష విరమణ వేడుకలకు అధికారులు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేశారు. నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 50 వేల నుంచి లక్ష మంది భవానీలు మొదటి మూడు రోజులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రెండు రోజుల్లో రోజుకు లక్ష నుంచి రెండు లక్షల మంది వరకూ భవానీలు వచ్చే అవకాశం ఉందని అంచనా.

దుర్గగుడి ఈవో కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ భవానీల దీక్షల విరమణ, అమ్మవారి దర్శనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. తొలిరోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. రెండో రోజు నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 వరకూ దర్శనాలకు అనుమతిస్తారు.

Vijayawada Kanaka durga Temple
విద్యుత్తు దీపాల వెలుగులో ఘాట్​ రోడ్డు (ETV Bharat)

5 క్యూలైన్లు : ఇంద్రకీలాద్రి కొండ దిగువన వినాయక గుడి నుంచి ఓం టర్నింగ్‌ వరకూ మూడు క్యూలైన్లు వేశారు. ఓం టర్నింగ్‌ వద్ద నుంచి ఐదు లైన్లుగా భక్తులు దర్శనాలకు వెళ్తారు. వీటిలో రూ.500, రూ.300, రూ.100 టికెట్ల క్యూలైన్లు మూడు, మిగతా రెండు ఉచిత దర్శన లైన్లు ఉంటాయి. భక్తులు అమ్మవారి దర్శనం అనంతరం శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు దిగిపోతారు. అక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.

Vijayawada Kanaka durga Temple
దుర్గగుడి వద్ద సిద్ధం చేసిన హోమం (ETV Bharat)

కాటకపల్లిలో వేడుకగా దేవీనవరాత్రులు - కనుల పండువలా సాంస్కృతిక కార్యక్రమాలు

20 లక్షల లడ్డూ ప్రసాదం: 20 లక్షల లడ్డూ ప్రసాదం భక్తుల కోసం తయారు చేసేందుకు ముందస్తుగా సిద్ధం చేశారు. భక్తులకు అమ్మవారి ప్రసాదం విక్రయించేందుకు 14 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి దిగువున 11, కొండపైన ఒకటి, రైల్వేస్టేషన్, బస్టేషన్‌లో ఒక్కొక్కటి ఉన్నాయి.

800 షవర్లు : భవానీ భక్తులు కృష్ణా జల్లు స్నానాలు చేసేందుకు సీతమ్మ వారి పాదాల వద్ద 500, పున్నమి ఘాట్‌ వద్ద 200, భవానీ ఘాట్‌ వద్ద 100 షవర్లను ఏర్పాటు చేశారు.

  • నాలుగు వేల మంది పోలీసులు ఉత్సవాల నిర్వహణలో పాల్గొంటున్నారు.
  • భవానీ భక్తులు ఇరుముడి సమర్పించడానికి 110 స్టాండ్లు ఏర్పాటు చేశారు. వీటిని ప్రసాదాల కౌంటర్ల వద్ద ఉన్న షెడ్డు, గోశాల పక్కనున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేశారు.
  • పున్నమిఘాట్, సీతమ్మవారి పాదాలు, భవానీఘాట్‌ వద్ద 850 కేశఖండన శాలలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 850 మంది నాయీబ్రాహ్మణులను తలనీలాలు తీసేందుకు నియమించారు.

వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణం - అమ్మవారికి అడుగడుగునా భక్తుల నీరాజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.