Chettinad Fish Curry recipe in Telugu : చెట్టినాడ్ అంటే తమిళనాడులోని ఓ ప్రాంతం. వంటలకు పెట్టింది పేరు. చెట్టినాడ్ స్టైల్లో చేసే నాన్ వెజ్ వంటలు ఇక్కడ ఎంతో ప్రత్యేకం. కోడి పులుసైనా, చేపల కూర అయినా సరే. రుచి అద్భుతంగా ఉంటుంది. కాస్త కారంగా తినడం ఇష్టపడే వాళ్లయితే చెట్టినాడ్ స్టైల్ కూరల్లోని మిరియాల (పెప్పర్) ఘాటుకు ఫిదా అయిపోతారంటే నమ్మండి.
చేపల పులుసు తెలంగాణలో ఘాటుగా, ఏపీలో పులుపుగా, కేరళలో స్పైసీగా ఉంటుంది. చెట్టినాడ చేపల పులుసు మాత్రం కారంగా, ఘాటుగా, సువాసనతో ఉంటుంది. ఎందుకంటే ఈ పులుసులో వాడే పదార్థాలు భిన్నంగా ఉంటాయంతే. అందుకే అసలు సిసలైన చేపల పులుసు తినాలనుకుంటున్నట్లయితే చెట్టినాడు చేపల పులుసు ఒక్కసారి ట్రై చేయండి. మీరు కోరుకున్న రుచి దొరకడంతో పాటు పొట్ట నిండుతుంది. మనసు కూడా తేలిపోతుంది. ఆలస్యం చేయకుండా చెట్టినాడ్ స్టైల్ చేపల పులుసు చేసేద్దాం పదండి!!
వీకెండ్ రెసిపీ : రాయలసీమ స్టైల్ మటన్ ఫ్రై - సింపుల్ టిప్స్‌తో ఇలా చేసుకోండి
కావాల్సిన పదార్థాలు
- చేపలు - అర కిలో
- కారం - 1 టేబుల్ స్పూన్
- మిరియాల పొడి - అర టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
గ్రేవీ కోసం
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- మిరియాలు - అర టేబుల్ స్పూన్
- సోంపు - అర టేబుల్ స్పూన్
- జీలకర్ర - - అర టేబుల్ స్పూన్
- వెల్లులి రెబ్బలు - 10
- ఎండుమిర్చి - 5
- ఉల్లిపాయ - మీడియం సైజువి రెండు (తరుగు కోసం)
- పసుపు - పావు టీ స్పూన్
- కరివేపాకు - 2 రెబ్బలు
- పచ్చి కొబ్బరి - పావు కప్పు
- ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
- కారం - 2.5 టేబుల్ స్పూన్లు
- టొమాటోలు - మూడు (సన్నని తరుగు)
- చింతపండు - నిమ్మకాయ సైజు
పాతకాలపు 'ఉప్మా' తయారీ విధానం - ఇలా చేస్తే మీకు 100 మార్కులు గ్యారెంటీ!
పులుసు కోసం
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టేబుల్ స్పూన్
- మెంతులు - పావు టేబుల్ స్పూన్
- వెల్లుల్లి - 4
- కరివేపాకు - 2 రెబ్బలు
- పచ్చిమిర్చి - 4 చీలికలు
- చిన్న ఉల్లిపాయలు - 10
- కల్లుప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర - చిన్న కట్ట తురుము
తయారీ విధానం
- ముందుగా చేప ముక్కలను మారినేషన్ చేసుకోవడానికి కారం, ఉప్పు, మిరియాల పొడిలో నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. దానిని చేప ముక్కలకి పట్టించి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
- మూకుడులో నూనె వేడి చేసుకుని మిరియాలు, జీలకర్ర, సోంపు, ఎండు మిర్చి, వెల్లులి వేసి వేగనివ్వాలి. తరువాత ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, పసుపు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా ఫ్రై చేసుకోవాలి.
- 5 నిమిషాల తర్వాత కొబ్బరి ముక్కలు, ధనియాల పొడి, కారం, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. టొమాటో ముక్కలు మెత్తగా మగ్గి నూనె పైకి తేలేదాక వేగనివ్వాలి. దీనిని కడాయిలో నుంచి మిక్సీలోకి తీసుకోవాలి. తర్వాత చింతపండును కూడా మిక్సీలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్ తయారు చేసుకోవాలి.
- మూకుడులో కొద్దిగా నూనె పోసుకుని వేడెక్కిన తర్వాత ఆవాలు మెంతులు వేసి ఆవాలు చిటపటమనిపించాలి. ఆ తరువాత సోంపు, జీలకర్ర, కరివేపాకు, వెల్లులి రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అవి వేగాక చిన్న ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి.
- ఆ తర్వాత చింతపండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ పోసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుని నూనె పైకి తేలేదాక సన్నని సెగ మీద ఉడికించాలి.
- నూనె పైకి తేలాక కావల్సినన్ని నీళ్లు పోసుసుని మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఉడికిస్తే చాలు. గ్రేవీ పైన నూనె తేలగానే చేప ముక్కలు వేసుకుని మరో 15 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగు, కాడలతో సహా కరివేపాకు వేసి స్టవ్ ఆపేస్తే చాలు.
'ఎన్ని వెరైటీలున్నా కరివేపాకు చికెన్ క్రేజ్ వేరే! - సింపుల్ టిప్స్‌తో సూపర్ టేస్ట్
చెట్టినాడ్ స్టైల్ టమోటా, పుదీనా చట్నీ - ఇడ్లీ, దోసెల్లోకి సూపర్ కాంబినేషన్!