Samagra Kutumba Survey at Panchayat Office :రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతోంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. కొందరు మాత్రం ఆదేశాలకు విరుద్ధంగా పని చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో, కాలనీల్లో ఒక దగ్గర ఉంటూ సర్వేలు చేపడుతున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే సర్వే చేశారు. అక్కడి కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తూ, గ్రామస్థులను అక్కడికే పిలుపించుకుని సభ్యుల వివరాలు అడిగి ఫారాల్లో నింపుతూ సర్వే చేశారు. పంచాయతీ కార్యాలయంలోనే సర్వే చేస్తున్నారని తెలిసి అక్కడికి గ్రామస్థులు పరుగులు పెట్టారు.
ఇదిలా ఉంటే ఇళ్లకు వెళ్లకుండా ఒక దగ్గరే ఉంటూ సర్వ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటికి వచ్చి సర్వే చేయాల్సిన వారు ఇలా ఒక దగ్గరే ఉంటూ చేయడం సరికాదన్నారు. వృద్ధుల, ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు ఎలా వెళ్లగలరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న వారైతే సర్వే చేస్తున్న దగ్గరకు వస్తారని, లేని సందర్భంలో ఎలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కుటుంబ సర్వే : ఫ్రిజ్లు, ఏసీలు, కార్లు ఉన్నవారికి సంక్షేమ పథకాలు కట్! - క్లారిటీ ఇచ్చిన మంత్రి
మంత్రి క్లారిటీ :మరోవైపు సోషల్ మీడియాలో ఫ్రిజ్లు, టీవీలు, ఏసీలు, కారు, ద్విచక్ర వాహనం ఇలా అన్ని వివరాలు వెల్లడిస్తే ప్రస్తుతం వస్తున్న ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ఈ సమాచారం సేకరించడంతో ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఆగిపోవని స్పష్టం చేశారు. ఇంకా అదనంగా పథకాలు అవ్వడానికి వినియోగిస్తామన్నారు.