Sahithi Infra Victims Protest At CCS :హైదరాబాద్ బషీర్బాగ్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ముందు సాహితీ ఇన్ఫ్రాటెక్ కంపెనీ బాధితులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి అమీన్పూర్లో సాహితీ శర్వాణి ఎలైట్ పేరుతో 25 ఎకరాల్లో 32 అంతస్తులతో 10 టవర్లు నిర్మిస్తామంటూ తమ వద్ద నుంచి సుమారు రూ.1500కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. వందల కోట్లు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్న సంస్థ ఎండీ లక్ష్మీనారాయణను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న కేసు దర్యాప్తు కొలిక్కి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా మంది కష్టార్జితంతో డబ్బులు పెట్టామని తమకు స్థలం లేక నగదు తిరిగి ఇప్పించాలని కోరారు. తక్షణమే ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు మొదలైనప్పటి నుంచి ముగ్గురు అధికారులు మారారని, కొత్తవారు వచ్చినప్పుడల్లా విచారణ మొదటికి వస్తుందని మండిపడ్డారు. 1200 కుటుంబాలు ఈ స్థలాలను నమ్ముకుని బతుకుతున్నామని బాధితులు గోడును వెల్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యను విన్నవించుకుందాం అన్నా వారు ఎన్నికల బీజీ ఉండడంతో కలవడం కుదరండం లేదని వాపోయారు. ఇకనైన వారు జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని బాధితులు కోరారు.
ప్రీ లాంచ్ పేరుతో రూ.1164 కోట్లు వసూలు - సాహితీ ఇన్ఫ్రాపై 50 కేసులు నమోదు