ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో తప్పిన పెను ప్రమాదం - బస్సులో 20 మందికి స్వల్ప గాయాలు
Published : Nov 29, 2024, 4:01 PM IST
|Updated : Nov 29, 2024, 4:07 PM IST
Sangareddy RTC Bus Accident :సంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆందోల్ మండలం కన్సాన్‌పల్లి గ్రామ శివారులో 161 జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 20 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోనున్న జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నారాయణఖేడ్ డిపోనకు చెందిన పల్లె వెలుగు బస్సు నారాయణఖేడ్ నుంచి జోగిపేటకు వెళ్తుండగా కన్సాన్‌పల్లి గ్రామ శివారు వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది.