Rold Gold Loan Fraud in Bapatla : బాపట్ల పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలో ఘరానా మోసం వెలుగు చూసింది. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా విధులు నిర్వహిస్తున్న వెల్లటూరి రాఘవేంద్ర రావు 21 మంది బినామీల పేరిట నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి ఒక కోటి రూ.77,62,000 రుణం తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. తాజాగా బ్యాంకులో ఆర్బీఐ(Reserve Bank Of India) ప్రతినిధులు ఆడిటింగ్ చేయగా నకిలీ బంగారం తాకట్టు పెట్టి కోట్లు స్వాహా చేసినట్లు బయటపడింది.
బ్యాంకు మేనేజర్ శ్రీ హరీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోల్డ్ అప్రైజర్ రాఘవేందర్ రావుతో పాటు 21 మంది ఖాతాదారులపై బాపట్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల గంజాయి అక్రమ రవాణా కేసులో అతన్ని బాపట్ల పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా కేంద్రం బాపట్లలో ఏడాది క్రితం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకు శాఖను ప్రారంభించారు.
ఒంటిపై కిలో బంగారంతో యాదాద్రిని దర్శించుకున్న 'గోల్డ్‌మేన్' - ఫొటోలు దిగేందుకు పోటీపడ్డ భక్తులు
Rold Gold Loan Fraud in AP :వెల్లటూరి రాఘవేంద్ర రావు అనే యువకుడు బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా విధుల్లో చేరాడు. గోల్డ్ అప్రైజర్‌గా బంగారం నాణ్యతను నిర్ధారించేది అతడే కావడంతో పక్కాగా ప్రణాళికతో ప్రకారం నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా ధ్రువీకరించి మోసానికి పాల్పడ్డాడు. రాఘవేంద్ర ఇచ్చిన ధ్రువీకరణ ఆధారంగా బ్యాంక్ అధికారులుశ్(Bank Of Maharashtra Gold Scam) వెనకా ముందూ ఆలోచించకుండా కోట్లలో గోల్డ్ లోన్స్ మంజూరు చేశారు. డిసెంబర్ జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ లోపు రుణాలు స్వాహా తతంగం నడిచింది.