Road Problems in Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా పేరొందింది. వివిధ గ్రామాల నుంచి పనుల నిమిత్తం వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారులు ఇరుకుగా ఉండడం వల్ల ట్రాఫిక్‌జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిర్యాలగూడ రాజీవ్ చౌక్ నుంచి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు రాజీవ్ చౌక్ నుంచి ఈదలగూడ వరకు రోడ్డు విస్తరణ జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో పూర్తి కాలేదు.
Roads Condition: రోడ్ల సమస్యను పట్టించుకోని నేతలు.. చివరకు
People Facing Problems With Damaged Roads :ఇదే క్రమంలో కోదాడ-జడ్చర్ల హైవే నిర్మాణ పనులు జరుగుతుండగా జడ్చర్ల హైవేని పట్టణం మధ్య నుంచి వెళ్లే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. విస్తరణలో భాగంగా స్థలం కోల్పోయిన వారికి పరిహారం, రోడ్డు నిర్మాణానికి కావలసిన నిధులు విడుదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలతో పనులు నిలిచిపోయాయి. ఎన్నికలు పూర్తైన పనులు మెుదలు పెట్టలేదు.
"మిర్యాలగూడలో రహదారులు ఇరుకుగా ఉండడం వల్ల ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతుంది. ఇక్కడ రోడ్డు చిన్నదిగా ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జడ్చర్ల, ఖమ్మం హైవేపై గల వాహనాలు మిర్యాలగూడ పట్టణం నుంచి వెళ్తుండటంతో వాహనాల రద్దీతో ఇబ్బందిగా ఉంది. మిర్యాలగూడలో మాత్రమే రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. సాయంత్రం వచ్చే పాఠశాల, కళాశాల వాహనాలతో ట్రాఫిక్ జామ్ పెరిగి నానా అవస్థలు పడుతున్నాము. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని రోడ్లు విస్తరిన పనులు చేయాలి." -స్థానికులు