Bhogapuram Road Accident Today : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు టైరు పంచరై అదుపు తప్పి అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ క్రమంలో అటుగా వస్తున్న లారీ ఢీకొనడంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
Road Accident in Polipalli : లారీ బలంగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాద ధాటికి కారు అద్దాలు పగిలి రోడ్లపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభినవ్, కౌశిక్‌గా గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ప్రమాదంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.