ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లింట విషాదం - రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, మరో నలుగురికి తీవ్రగాయాలు - ROAD ACCIDENT IN ANNAMAYYA DISTRICT

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం - శుభకార్యం కోసం వెళ్తుండగా ప్రమాదం

A Serious Road Accident in Annamayya District
A Serious Road Accident in Annamayya District (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2024, 10:37 PM IST

A Serious Road Accident in Annamayya District : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వేకోడూరులో కారు-ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. రాజా నగర్ వద్ద ఇన్నోవా కారును ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మొదట అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన వారందరనీ హుటహుటిన రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. తిరుపతిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

చనిపోయిన వారంతా కర్నూలుకు చెందిన వారిగా గుర్తించారు. కర్నూలులోని ప్రకాష్ నగర్​కు చెందిన బంగారు వ్యాపారి గురువయ్య శెట్టి కూతురు సిరి చందనకు తిరుపతికి చెందిన రోహిత్​కు ఈనెల 20న కర్నూలులో వివాహం అయ్యింది. గురువారం తిరుపతిలో వీరి వివాహానికి సంబంధించి రిసెప్షన్ కోసం కర్నూలు నుంచి తిరుపతికి బుధవారం బయలు దేరారు. ఈక్రమంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వద్ద కారును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గురువయ్య బంధువులు ఒకే కుటుంబానికి చెందిన రావూరి ప్రేమ్ కుమార్ (51), రావూరి వాసవి (48), కామిశెట్టి సుచరిత(45) మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు.

లోయలో పడిన ఆర్టీసీ బస్సు - 20 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details