తెలంగాణ

telangana

రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రెండేళ్లలో శాశ్వత ప్రభుత్వ భవనాలు : మంత్రి పొంగులేటి - MINISTER PONGULETI REVIEW

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2024, 7:05 PM IST

Updated : Aug 25, 2024, 7:37 PM IST

Minister Ponguleti Review on Revenue Dept : ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు నిజాయతీ, అంకిత భావంతో పని చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.

PONGULETI ON REVENUE DEPT PROBLEMS
Minister Ponguleti Review on Revenue Dept (ETV Bharat)

Minister Ponguleti Review on Revenue Dept :ప్రజలకు పారదర్శకంగా సేవలను అందించేందుకు రెవెన్యూ శాఖలో కొత్త టెక్నాలజీలను అవలంభించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖ సమస్యలపై ఇవాళ ఎంసీహెచ్‌ఆర్డీలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

అంకితభావంతో పని చేయాలి :ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ ఉద్యోగులందరూ నిజాయతీ, అంకిత భావంతో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ సమస్యలను త్వరలో క్లియర్ చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

త్వరలో శాశ్వత భవనాలు : రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను మంత్రి పొంగులేటి ప్రస్తావించారు. ఇందుకోసం త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీని కింద అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండేళ్లలో శాశ్వత ప్రభుత్వ భవనాల్లో పని చేయడం ప్రారంభిస్తాయన్నారు. ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసులను మన రాష్ట్రంలో కూడా పాటించేలా అధ్యయనం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

2014లో రూ.2,746 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం, గతేడాది రూ.14,588 కోట్లకు చేరుకుందని స్టాంపులు రిజిస్ట్రేషన్ల కమిషనర్, ప్రభుత్వ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్‌ జ్యోతి వివరించారు. రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై ఆయన సంక్షిప్త వివరణ ఇచ్చారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీలు సజావుగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ వార్షిక నివేదికను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ విడుదల చేశారు. రెవెన్యూ సమీకరణ, శాఖ పనితీరు, శాఖకు సొంత భవనాలు, డిపార్ట్‌మెంట్‌కు బడ్జెట్ ఆవశ్యకత మొదలైన వాటిపై రెవెన్యూ సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలను మంత్రికి అందించారు.

నా ఇంటిని మీరే వెళ్లి కొలవండి అక్రమమని తేలితే కూల్చేయండి : ఆ నేతలకు పొంగులేటి సవాల్ - PONGULETI CHALLANGES BRS LEADERS

రాష్ట్రంలో త్వరలోనే లొసుగుల్లేని పటిష్ఠమైన రెవెన్యూ చట్టం : మంత్రి పొంగులేటి - NEW REVENUE ACT IN TELANGANA

Last Updated : Aug 25, 2024, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details