తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుద్యోగులకు విశ్రాంత లెక్చరర్ ఉచిత ఆన్​లైన్ శిక్షణ - 600మందికి ప్రభుత్వ కొలువులు - Retired Lecturer Providing Coaching

Retired Lecturer Providing Free Coaching : నేటి కాలంలో రోజూ కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి గంటల తరబడి చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా కష్టం. అలాంటిది నామమాత్రం ఫీజ్‌ చెల్లించి ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్న యువత మాత్రం సునాయసంగా కొలువులు సాధిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తూ ఎంతో మందిని తీర్చిదిద్ది ఉద్యోగ కల్పనలో తమ వంతు పాత్ర పోషిస్తున్న అధ్యాపకులు ఎవరో చూద్దాం

Retired Lecturer Providing Free Coaching
Retired Lecturer Providing Free Coaching

By ETV Bharat Telangana Team

Published : Mar 22, 2024, 8:02 PM IST

ఫ్రీ ఆన్‌లైన్‌ కోచింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తోన్న యువత- ఎక్కడంటే?

Retired Lecturer Providing Free Coaching :ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఇందుకోసం కోచింగ్​ సెంటర్లకు వెళ్లి గంటల తరబడి చదివినా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అలాంటిది నామమాత్రపు ఫీజు చెల్లించి ఆన్​లైన్​లో శిక్షణ తీసుకున్న యువత మాత్రం సునాయాసంగా ప్రభుత్వ కొలువులు సాధించారు. ఉచితంగా శిక్షణ ఇస్తూ ఎంతో మందిని తీర్చిదిద్ది ఉద్యోగ కల్పనలో తమ వంతు పాత్ర పోషిస్తున్న అధ్యాపకులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Nalgonda Economic Forum : నల్గొండ జిల్లాకి చెందిన విశ్రాంత అధ్యాపకుడు డా.అక్కేనపల్లి మీనయ్య చదువుకునే సమయంలో అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి కష్టాలు ఎవరు పడకూడదని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని 2007లో నల్గొండ ఎకనామిక్స్ ఫోరాన్ని ప్రారంభించారు. అర్థశాస్త్ర విభాగంలో సబ్జెక్ట్ వివరంగా చెప్పేవారు లేకపోవడం, ఫ్రీ కోచింగ్‌ కావడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అందులో కోచింగ్‌ తీసుకోని ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు. కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో శిక్షణ తరగతలు ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్న యువతకూడా సునాయసంగా ఉద్యోగాలు సాధించారు.

Coaching For poor people :పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకోని ప్రారంభించిన నల్గొండ ఎకనామిక్స్ ఫోరానికి మంచి స్పందన వచ్చిందని నిర్వహకులు చెబుతున్నారు. విద్యార్థుల కోసం వివిధ కళాశాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధ్యాపకులుచే ప్రతిరోజు జూమ్‌ లో శిక్షణ ఇచ్చేవారమని చెప్పారు. ఇప్పటి వరకు తమ వద్ద శిక్షణ తీసుకుని 600 మంది పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని డా.అక్కేనపల్లి మీనయ్య చెప్పారు. ఆన్‌లైన్ కోచింగ్ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు గురుకుల జూనియర్ అర్థశాస్త్ర ఉపన్యాసకులుగా అధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించారని నిర్వహకులు భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు వందల సంఖ్యలో ఉద్యోగాలు సాధించారన్నారన్నారు.

ఓయూ దిద్దిన వాచ్‌మెన్‌ కథ ఇది - కోచింగ్‌ లేకుండానే ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం

విద్యార్థుల అభిప్రాయం
నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో విద్యార్థులకు చాలా చక్కగా ఉపయోగపడిందని పూర్వ విద్యార్థి సుల్తానా చెప్పారు. తాను చదువుకున్న కళాశాలలోనే ఇవాళ ప్రిన్సిపల్‌గా పనిచేయడానికి కారణం ఎకనామిక్స్ ఫోరం అని చెబుతున్నారు. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఆధ్వర్యంలో ఇచ్చిన ఉచిత శిక్షణ వలన తాము ప్రభుత్వం ఉద్యోగం సాధించినట్లు విజేతలు చెబుతున్నారు. పేద విద్యార్థులకు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఎంతగానో ఉపయోగపడుతోందని విద్యార్థులు చెబుతున్నారు

నిరుపేద కుటుంబంలో పుట్టిన యువతి - 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కైసవం - Chandrakala Gets 3 Central Jobs

స్విగ్గీ, జొమాటో కుర్రాడు - కొట్టాడు 3 సర్కారీ నౌకరీలు - Delivery Boy Got 3 Govt Jobs

అయినవాళ్లు లేకున్నా అనుకున్నది సాధించాడు - 10 ఏళ్లు కష్టపడి 4 సర్కార్ కొలువులు కొట్టేశాడు

ABOUT THE AUTHOR

...view details