Supreme Court Verdict On NEET Counselling Issue : నీట్ కౌన్సెలింగ్‌లో స్థానికత వ్యవహారంలో రాష్ట్ర విద్యార్థులకు ఊరట లభించింది. కౌన్సెలింగ్‌కు విద్యార్థులు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థుల కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం అంగీకరించింది. సమయం తక్కువగా ఉండటంతో అనుమతించినట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ ఒక్కసారే అవకాశం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పును సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్పై సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. స్థానికతను నిర్ధారిస్తూ 4 తీర్పులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తీర్పులు స్పష్టంగా ఉన్నా, మళ్లీ కోర్టును ఆశ్రయించారని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలను విద్యార్థుల తరఫు న్యాయవాది విభేదించారు. రెండు, మూడేళ్లు రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికతను ఎలా తీసేస్తారని విద్యార్థులు అన్నారు.