తెలంగాణ

telangana

ETV Bharat / state

రామోజీ ఫౌండేషన్ దాతృత్వం - రూ.70 లక్షలతో దివ్యాంగులకు పాఠశాల భవనం - RAMOJI FOUNDATION CHARITY WORKS

మనోవికాస కేంద్రానికి అండగా రామోజీ ఫౌండేషన్‌ - రూ.70 లక్షలతో నూతన పాఠశాల భవనం నిర్మాణం - నూతన భవనాన్ని ప్రారంభించిన ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్‌

Ramoji Foundation Charity Works
Ramoji Foundation Charity Works (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2024, 8:35 PM IST

Updated : Dec 14, 2024, 10:17 PM IST

Ramoji Foundation Charity Works :ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా వార్తలను క్షణాల్లో అందించడమే కాదు ఆపదలో ఉన్న వారికి సైతం ఈనాడు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. రామోజీ ఫాండేషన్ ద్వారా ఇప్పటికే వేలాది మంది అభాగ్యులకు గూడు దొరికింది. తాజాగా హనుమకొండలో మల్లికాంబ మనో వికాస కేంద్రంలోని చిన్నారులకు శాశ్వత ఆశ్రయాన్ని రామోజీ ఫౌండేషన్ కల్పించింది. సకల హంగులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ ప్రారంభించారు.

రూ.70 లక్షలతో దివ్యాంగుల కోసం పాఠశాల భవనం :అనాథలు, బధిరులు, మానసిక దివ్యాంగ విద్యార్థుల కోసం హనుమకొండలో 2001లో మల్లికాంబ మనోవికాస కేంద్రం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఓ రేకులషెడ్డులో చిన్నారులకు విద్యాబోధన చేసేవారు. అయితే గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఆ రేకుల షెడ్డు కూలిపోయి 220 మంది విద్యార్థులకు నిలవనీడ లేకుండా పోయింది. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారికి రామోజీ పౌండేషన్ నేనున్నానంటూ భరోసా కల్పించింది. చిన్నారుల కోసం రామోజీ పౌండేషన్‌ ఆధ్వర్యంలో దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చుచేసి సకల సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్​ ప్రసాద్ ప్రారంభించారు.

దివ్యాంగులకు చేయూత నివ్వడం అందరి బాధ్యత :ముందుగా వరంగల్‌ జిల్లా ఈనాడు సిబ్బందితో కలిసి మల్లికాంబ మనోవికాస కేంద్రంలో ఫోటో గ్యాలరీని ఈనాడు తెలంగాణ ఎడిటర్‌ డీఎన్‌ ప్రసాద్‌ సందర్శించారు. మానసిక దివ్యాంగులకు చేయూతనివ్వడం మనందరి బాధ్యత అని ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని వెల్లడించారు.

వార్తలను మాత్రమే ప్రసారం చేస్తూ సరిపెట్టుకోకుండా ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాల్సిన సామాజిక బాధ్యత ప్రతి జర్నలిస్టుపై ఉందని వెల్లడించారు. ఎన్నో ప్రకృతి విపత్తుల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ఈనాడు ఫౌండేషన్‌ ఎన్నో విధాలుగా తోడుగా నిలిచిందని గుర్తుచేశారు. పండగలూ పబ్బాలు వివాహాలూ ఇతర వేడుకల్లో పెట్టే ఖర్చును కాస్త తగ్గించుకుని సేవా కార్యక్రమాల కోసం వెచ్చించాలని సూచించారు.

"1974 ఆగస్టు 10న ఈనాడు ప్రారంభించిన తర్వాత ఆర్థికంగా పెద్దగా వెసులుబాటు లేని రోజుల నుంచే ఇటువంటి సహాయ కార్యక్రమాల్లో పాల్గోవాలనేది ఛైర్మన్​ గారి ఆకాంక్ష. పత్రిక అంటే కేవలం సమాచారాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి చేరవేసే సాధనం కాదు. ప్రజాజీవితంలో మమేకమై ఉండాలి. ప్రజలకు కష్టాలు కన్నీళ్లలో తోడుగా ఉండి రూపుమాపడమో తగ్గించడమో చేయగలిగే సామాజిక బాధ్యతని పత్రిక తలకెత్తుకోవాల అదే రియల్​ జర్నలిజం అనేది వారి ఆకాంక్ష. కొన్ని వందల వేల వాటికి బిల్డింగ్​లు, పరికరాలు అందివ్వడం ఇతరత్రా సహాయాలు ఎన్నో చేస్తూ వచ్చాం. కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత ఇంతకంటే గొప్ప సహాయం ప్రపంచంలో మరొకటి ఉండదు అని నేను భావిస్తున్నాను" -డీఎన్ ప్రసాద్, ఈనాడు తెలంగాణ ఎడిటర్

ఇవాళ నిజంగా మాకు పండుగ రోజు :24 ఏళ్లుగా దివ్యాంగుల సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నానని వారికి నీడ కల్పించాలనే ఆకాంక్ష ఇన్నాళ్టికి నెరవేరిందని మల్లికాంబ మనోవికాస కేంద్రం వ్యవస్థాపకురాలు రామలీల తెలిపారు. రామోజీ ఫౌండేషన్ ద్వారానే తమకో చక్కటి భవనం సమకూరిందని నిజంగా ఇవాళ తమకు పండుగ రోజని మనోవికాస కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పేర్కొన్నారు. నూతన భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విచిత్ర వేషధారణలలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందర్నీ విశేషంగా అలరించాయి.

"మా ముగ్గురు పిల్లల్లో ఇద్దరు మెంటల్లీ రిటార్డెడ్​. నేను చాలా కష్టాలు పడ్డా. సర్​ జాబ్​వల్ల మేము ట్రాన్స్​ఫర్​ అయి కొత్త ప్లేస్​కు వెళ్లేవాళ్లం. అలా వెళ్లినప్పుడు ఇట్లాంటి పిల్లలున్నారని తెలిసి ఇంటిని ఖాళీ చేయమనేవారు. ఇట్లాంటి మానసిక వికలాంగులకు గుర్తింపు రావాలి, వారు కూడా మనలాంటి మనుషులే అనే ఉద్దేశంతో ఈ ఇన్​స్టిట్యూషన్​ ఏర్పాటు చేయడం జరిగింది. 24 ఏళ్లుగా చాలా కష్టాలు పడి రేకుల షెడ్​లో ఇన్​స్టిట్యూషన్​ రన్​ చేశాం. రామోజీ ఫౌండేషన్​ వారి ద్వారా ఇంత మంచి బిల్డింగ్​ను మేము మా పిల్లలకు కట్టుగలిగామంటే రామోజీ రావు గారి దయవల్లనే"- రామలీల, మల్లికాంబ మనోవికాస కేంద్రంవ్యవస్థాపకురాలు

పెదపారుపూడిలో రామోజీ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో భవనాలు.. ప్రారంభించిన శైలజాకిరణ్​

రామోజీ ఫౌండేషన్‌ దాతృత్వం.. రూ.కోటీ 50 లక్షలతో వృద్ధాశ్రమం

Last Updated : Dec 14, 2024, 10:17 PM IST

ABOUT THE AUTHOR

...view details