తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షాలకు నేలరాలిన మామిడి - 1500 ఎకరాల్లో పంట నష్టం - MANGO FARMERS LOSS IN NALGONDA - MANGO FARMERS LOSS IN NALGONDA

Mango Farmers Loss Due To Untimely Rains in Nalgonda : అకాలవర్షం ఉమ్మడి నల్గొండ జిల్లాను అతలాకుతలం చేసింది. అకస్మాత్తుగా ఈదురుగాలలు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి చేతికొచ్చే పంట నేలమట్టమై నట్టేట ముంచిందని రైతులు వాపోతుతున్నారు. గాలి బీభత్సానికి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 15వందల ఎకరాల్లో మామిడి నేలరాలినట్లు ఉద్యానవన అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు.

Mango Farmers Loss Due To Untimely Rains in Nalgonda
Mango Farmers Loss Due To Untimely Rains (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 10:25 AM IST

అకాల వర్షాలకు నేలరాలిన మామిడి - 1500 ఎకరాల్లో పంట నష్టం (ETV Bharat)

Mango Farmers Loss Due To Untimely Rains : అకాల వర్షం పండ్ల తోటలపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికంగా సాగవుతున్న మామిడి తోటలపై ఈదురుగాలుల ప్రభావం పడింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజుర్‌నగర్‌, సూర్యాపేట, తుంగతుర్తి నల్గొండ జిల్లాలోని నల్గొండ, మల్లేపల్లి, దేవరకొండ, కనగల్‌, పెద్దపూర ప్రాంతాల్లో గాలిదూమారానికి మామిడికాయలు నేలరాలాయి. సుమారు 15వందల ఎకరాల్లో మామిడి రాలినట్లు ఉద్యానవన అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయి నష్టం అంచనా వేస్తే ఆ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Mango Crop Loss in Nalgonda :సాధారణంగా మే నెలలో మామిడి కాయలకు మంచి ధర వస్తుందన్న రైతులు ఈదురుగాలలు, గాలి దూమారానికి చేతికి వచ్చిన పంట నేలరాలి తీవ్రంగా నష్టపోయామని మామిడి రైతులు చెబుతున్నారు. వాటిని మార్కెట్‌లో విక్రయించినా ధరలు తక్కువగా వస్తాయని వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడి దక్కేలా లేదని కర్షకులు వాపోతున్నారు.

ప్రకృతి కన్నెర్రకు పెట్టుబడి వర్షార్పణం - అకాల వర్షాలతో అన్నదాత అతలాకుతలం - crop damage in telangana

"గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు, ఈదురుగాలులకు మామిడి కాయలన్నీ రాలిపోయాయి. మేము ఈ భూమి కౌలుకు తీసుకున్నాం. అసలే మామిడి దిగుబడి సగానికి పడిపోయింది. ఇప్పుడు వర్షం వల్ల ఉన్న పంటంతా రాలిపోయింది, వర్షాలకు ముందు కిలో మామిడి పండు 40 నుంచి 50రుపాయలకు పడిపోయింది. నేలరాలిన కాయలను చూసి కొనుగోలుదారులు ఒక్క కాయ కనీసం 5రూపాయలకు కూడా కొనడం లేదు." - రైతు

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన హరీశ్‌రావు - తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులకు సూచన - Harish Rao Visit Crop Damage

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో మామిడిపండ్లు రూ.40 నుంచి 50రూపాయల వరకు పలుకుతోంది. గాలి దుమారానికి నేల రాలిన కాయలను రూ.5లకు కొనే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి బీభత్సానికి పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మామిడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

"మేము రెండెకరాలు కౌలుకు తీసుకున్నాం. మొదట్లో నిప్పుపడి కాయలన్నీ కాలిపోయాయి. ఇప్పుడు గాలికి పంటంతా రాలిపోయింది. ఒక్కకాయ కూడా అమ్మే పరిస్థితి లేదు. తినడానికి తిండి కూడా లేదు. కౌలు చేసుకుని బతికే రైతులం మేము. ప్రభుత్వం ద్వారా మాకేమన్నా పరిహారం అందితే బాగుంటుంది." - రైతు

ఈదురు గాలుల బీభత్సం - పలు జిల్లాల్లో నేలకొరిగిన ఉద్యాన పంటలు - Untimely Rains in Telangana 2024

రాష్ట్రంలో పలు చోట్ల వాన బీభత్సం - తడిసి ముద్దయిన ధాన్యం - Crop Damage in Telangana

ABOUT THE AUTHOR

...view details