RAINS IN HYDERABAD :హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, జవహర్ నగర్, మారేడుపల్లి, చిలకలగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ప్యారడైజ్, బేగంపేట్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, హయత్‌నగర్, అబ్దూల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాలలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
తెలంగాణపై ఉపరితల ఆవర్తనం - పలు జిల్లాల్లో భారీవర్ష సూచన - Hyderabad Rain Updates
వర్షం పడుతుండడంతో వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని ఐటీ కంపెనీల కార్యాలయాలు ముగించుకుని ఉద్యోగులు ఒకేసారి రోడ్డు పైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐకియా నుంచి హైటెక్ సిటీకి వెళ్లే మార్గాల్లో ఇరువైపులా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహన రాకపోకలను క్రమబద్దీకరిస్తున్నారు. ట్రాఫిక్ కాకుండా ఉండేందుకు ఐటీ కంపెనీల ఉద్యోగులు వారి వారి ప్రయాణ వేళల్లో మార్పులు చేసుకోవాలని పోలీసులు సూచించారు.
మరో మాడు రోజులు వర్షాలు.. రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య దానిని ఆనుకొని వున్న వాయువ్య బంగాళాఖతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కి. మీ. మధ్య ఉన్న ఆవర్తనం ఈ రోజు అదే ప్రాంతంలో కొనసాగుతూ ఎత్తు పెరిగే కొలది నైరుతి దిక్కుకు వంపు తిరిగి ఉన్నదని ఒక ప్రకటనలో పేర్కొంది.