తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం - రోడ్లపై పారుతున్న వరద నీరు - Heavy Rain in Hyderabad - HEAVY RAIN IN HYDERABAD

Rain in Few Areas in Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం పడగా రహదారులు జలమయమయ్యాయి. సికింద్రాబాద్​లోని బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్​, బేగంపేట్​, చిలకలగూడ,మారేడుపల్లి ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా చల్లబడి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.

Rains in Hyderabad
Rain in few areas in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2024, 11:01 PM IST

Rains in Hyderabad : హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్​లో తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వాన నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.

పొంగిపోర్లుతున్న డ్రైనేజీలు :సికింద్రాబాద్​లోని బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్​, బేగంపేట్​, చిలకలగూడ,మారేడుపల్లి ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా చల్లబడి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతు వర్షపు నిలవడంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

పలు ప్రాంతాల్లో వర్షం :బోరబండ, మధురానగర్, యూసఫ్ గూడా, అమీర్​పేట్​, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్ నగర్ పరిసరాల ప్రాంతాల్లో వర్షం పడింది. మియాపూర్, ఉప్పల్​లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లితోపాటు కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, బాలానగర్, జీడిమెట్ల, షాపూర్ నగర్ సూరారం, సుచిత్రలో ప్రాంతాల్లో వర్షం పడింది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం :

  • ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌లో వర్షం
  • కేపీహెచ్‌బీ, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్‌లో వర్షం
  • ప్రగతినగర్, బాచుపల్లి, మూసాపేట్‌లో వర్షం
  • మియాపూర్, చందానగర్, లింగంపల్లిలో వర్షం
  • కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో వర్షం
  • రాయదుర్గం, మధురానగర్, యూసఫ్‌గూడా లో వర్షం
  • కండ్లకోయ, కృష్ణాపూర్‌లో వర్షం
  • దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట్‌లో వర్షం
  • రామంతపూర్‌, నాచారం, ముషీరాబాద్‌లో వర్షం
  • రాజేంద్రనగర్‌, మలక్‌పేట, నాగారంలో వర్షం
  • హిమాయత్‌నగర్, నారాయణగూడలో వర్షం
  • ఉప్పల్‌, బోడుప్పల్, పీర్జాదిగూడలో వర్షం
  • మేడిపల్లి, సైదాబాద్, చంపాపేట్‌లో వర్షం
  • సరూర్‌నగర్, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్టలో వర్షం
  • బాలానగర్, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌లో వర్షం
  • సూరారం, సుచిత్ర, కోఠి, సుల్తాన్‌బజార్‌లో వర్షం
  • అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీలో వర్షం
  • చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్ వర్షం
  • అడిక్‌మెట్, గాంధీనగర్, జవహర్‌నగర్‌లో వర్షం
  • కవాడీగూడ, దోమలగూడ, బోలక్‌పూర్‌లో వర్షం
  • తార్నాక, ఓయూ, లాలాపేట్, హబ్సిగూడలో వర్షం
  • నాచారం, మల్లాపూర్, లాలాపేట్‌లో వర్షం
  • ఎల్బీనగర్, నాగోల్, సరూర్‌నగర్‌లో వర్షం
  • దిల్‌సుఖ్‌నగర్, ముసారంబాగ్‌లో వర్షం
  • సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరిలో వర్షం
  • అల్వాల్, బేగంపేట్, పారడైజ్, చిలకలగూడ మారేడుపల్లిలో వర్షం

హైదరాబాద్‌లోని మళ్లీ వర్షం - ప్రధాన ప్రాంతాల్లో దంచి కొడుతున్న వాన - Heavy Rainfall in Hyderabad

వర్షం పడితే వణుకే : బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ఆ ఊరు ప్రజలు - Flood Affects in Telangana

ABOUT THE AUTHOR

...view details