తెలంగాణ

telangana

ETV Bharat / state

పదో తరగతి విద్యార్థుల ర్యాగింగ్! - ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం - RAGING COMMOTION IN ASHRAM SCHOOL

మహబూబాబాద్​లోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్ కలకలం - పదో తరగతి విద్యార్థుల ర్యాగింగ్ తాళలేక ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం - హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2024, 8:29 AM IST

Raging Commotion in Ashram School : పదో తరగతి విద్యార్థుల ర్యాగింగ్​ తాళలేక ఆరో తరగతి స్టూడెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్​ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థి బంధువులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు పనులు చేయాలంటూ తరచూ బాధిత విద్యార్థిని వేధిస్తూ, కొడుతూ ఉండేవారు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు ఎలర్జీ నివారణకు వాడే ఔషధం తాగాడు. గమనించిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యార్థిని వెంటనే మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

10వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు తరచూ తనను ర్యాగింగ్ చేస్తున్నారని పలుమార్లు వార్డెన్, ప్రధానోపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత విద్యార్థి తెలిపాడు. ఈ విషయంపై ప్రభుత్వ హాస్పిటల్ ఆర్.ఎం.ఓ డాక్టర్ జగదీశ్​ మాట్లాడుతూ, బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ప్రాణాపాయం లేదని తెలిపాడు. విషయంపై గిరిజనాభివృద్ధి శాఖ ఉప సంచాలకుడు మాలోత్ సైదా నాయక్​ను వివరణ కోరగా, గూడూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి కంప్లైంట్ అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details