Raghunandan Rao on Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గతంలో తాను చెప్పిందే నిజమైందని, దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు(Praneeth rao) ఒప్పుకున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం లేకుండా పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను ఏ1గా, ఏ2గా హరీశ్‌రావు, ఏ3గా అప్పటి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రాంరెడ్డిని చేర్చాలని కోరినట్లు ఆయన తెలిపారు.
వాళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేయబోతున్నారు- రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు
Phone Tapping Case :దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్‌ను టాపింగ్ చేశారని 2020 నవంబర్‌లో చెప్పినప్పుడు, ప్రతిపక్ష నాయకుల ఆరోపణలు సహజమేనని అప్పటి పాలకులు కొట్టిపారేశారని రఘునందన్‌రావు(Raghunandan Rao) తెలిపారు. తన ఫిర్యాదుపై ప్రత్యేకంగా కేసు నమోదు చేసి, నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌తో ఏపీలో జగన్మోహన్ రెడ్డికి, కర్ణాటకలో కుమారస్వామికి లబ్ధి చేకూర్చేలా చేశారని ఆయన ఆరోపించారు.
మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ నేత అందెల శ్రీరాములు ఫోన్ సైతం ట్యాపింగ్ చేశారని రఘునందన్ రావు ఆరోపించారు. అంతేకాకుండా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, ఈరోజు హైదరాబాద్‌కు వస్తున్న సీజేఐ చంద్రచూడ్‌కి ఈ విషయాన్ని తెలియజేయాలని న్యాయమూర్తులను ఆయన కోరారు. మునుగోడు ఉపఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించిన రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఫిర్యాదు చేయాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్‌తో సినీ పరిశ్రమ, స్థిరాస్తి వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేశారని దుయ్యబట్టారు. ఒక్కో ఫిర్యాదుపై ఒక్కో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
"మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం లేకుండా గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేయలేరు. గతంలో నేను చెప్పిందే నిజమైంది. దుబ్బాక ఉపఎన్నికల సమయంలో నా ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు ఒప్పకున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరుతూ డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశాను. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను ఏ1గా, ఏ2గా హరీశ్‌రావు, ఏ3గా అప్పటి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రాంరెడ్డిని చేర్చాలి". - రఘునందన్ రావు, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే
కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు : రఘునందన్ రావు ''ఫోన్ ట్యాపింగ్'లో కొందరినే బాధ్యులు చేయడం సరికాదు - ఆ ముగ్గురిని నిందితులుగా చేర్చాలి' - BJP on Phone Tapping Case
ఫోన్ ట్యాపింగ్ కేసు - నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా - telangana phone tapping case