తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళలను వేధిస్తే షీ టీమ్ మీ భరతం పడుతుంది - జాగ్రత్త - CP Detain For Harassing Women

Rachakonda CP Detain 108 persons For Harassing Women : మహిళలను, యువతులను వేధిస్తున్న పోకిరీలపై రాచకొండ పోలీసుల బృందం గట్టి నిఘా పెట్టింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకతాయిలపై పోలీసులు కేసు నమోదు చేసి తమ స్టైల్​లో కౌన్సిలింగ్​ ఇస్తున్నారు. గత పదిహేను రోజుల్లో మహిళలను, యువతులను వేధిస్తున్న 108 మందిని పోలీసులు పట్టుకున్నారు.

Rachakonda CP Detain 108 persons For Harassing Women
మహళలను వేధిస్తున్న అకతాయిలపై కొరడా ఝుళిపిస్తున్న పోలీసులు - 108 మందికి కౌన్సిలింగ్​

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 7:09 PM IST

Rachakonda CP Detain 108 persons For Harassing Women :యువతులు, మహిళలను వేధిస్తున్న పోకిరీలపై రాచకొండ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఆధారాలతో సహా వారిని పట్టుకుని చర్యలు చేపడుతున్నారు. అవసరమైతే డెకాయి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. వేధింపులకు పాల్పడుతున్న కొందరిపై కేసులు నమోదు చేస్తుండగా, మరికొందరికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. తీరు మార్చుకోని వారిని కటకటాల వెనక్కి పంపుతున్నారు.

కమిషనరేట్‌ పరిధిలోని 15 రోజుల్లో 108 మంది ఆకతాయిలను పోలీసులు పట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా గత 15 రోజుల్లో 32 మంది మహిళను వేధించగా, నేరుగా 54 మంది వేధింపులకు పాల్పడ్డారు. వాట్సాప్‌ సందేశాల ద్వారా మరో 18 మంది వేధించారు. షీ బృందాల(SHE Team Polic) పోలీసులు పోకిరీలను ఆధారాలతో సహా పట్టుకున్నారు. వీరిలో 67 మంది మేజర్లు(major)కాగా, 41 మంది మైనర్లున్నారు. మైనర్లకు(Minor) వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎల్బీ నగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు.

Police helpline number for Harassment Complaint : యాదాద్రి భువనగిరి జిల్లాలో బాల్య వివాహం జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడకి చేరుకుని వివాహం జరగకుండా నిలిపివేశారు. మైనర్ బాలికకు బాల్య వివాహం నుంచి విముక్తి కల్పించారు. మహిళలు తమను వేధించే పోకిరీల గురించి ఆయా పరిధి వాట్సాప్​ నెంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చాని సీపీ సుధీర్​ బాబు సూచించారు.

రాచకొండ వాట్సాప్‌ నెంబర్ 8712662111 ద్వారా, ఆయా ప్రాంతాల వారిగా భువనగిరి- 8712662598, చౌటుప్పల్‌ - 8712662599, ఇబ్రహీపట్నం -8712662600, కుషాయిగూడ-8712662601, ఎల్బీనగర్‌-8712662602, మల్కాజిగిరి-8712662603 వనస్థలిపురం-8712662604 నెంబర్ల ద్వారా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు తెలిపారు. మహిళలను వేధిస్తే ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు.

CP Sudheer Babu On Drugs : మరోవైపు రాష్ట్రంలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సుధీర్​ బాబు హెచ్చరించారు. చట్టాన్ని గౌరవించే వారికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, నేరాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నిందితులకు శిక్ష పడేలా చేయడంలో రాచకొండ కమిషనరేట్ ముందు వరుసలో ఉందని ఆయన గుర్తు చేశారు.

నగరంలో మాదక ద్రవ్యాల మాటే వినబడకూడదనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీపీ సుధీర్ ​బాబు తెలిపారు. డ్రగ్స్ సరఫరాదారుల మూలాలను వెలికి తీసి మరీ నిందితులను కటకటాల్లోకి నెడుతున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలు అరికట్టేందుకు కృషి చేస్తున్నామని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

'భువనగిరి హాస్టల్​ పరిశీలించిన కవిత - మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి'

మరో నైజీరియన్ గ్యాంగ్ అరెస్ట్ - రూ.8కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details