Producer KP Chowdary Died In Goa :డ్రగ్స్ కేసు నిందితుడు, నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు. గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేపీ చౌదరి మృతిపై పాల్వంచలో ఉన్న తల్లికి పోలీసుల సమాచారం అందించారు. గతంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.
ఖమ్మం జిల్లా భోనకల్కి చెందిన కేపీ చౌదరి కబాలి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. కేపీ చౌదరి తెలుగు, తమిళం సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు.
కీలక విషయాలు రాబట్టిన పోలీసులు : 2023 జూన్‌లో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ క్రాస్ రోడ్డు వద్ద మాదాపూర్ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులుపట్టుకున్నారు. అతని వద్ద నుంచి 82.75 గ్రాముల కొకైన్, ఒక కారు, రూ.2.05 లక్షల నగదు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అతనితో చాలా మంది సినీ ప్రముఖులు కాంటాక్ట్‌లో ఉన్నట్లు అప్పట్లో విపరీతంగా ప్రచారం జరిగింది. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టారు. అయితే కొన్ని రోజులకు బెయిల్ రావడంతో గోవాలో ఉంటున్నట్లు సమాచారం. హోటల్ గదిలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
KP Chaudhary Drugs Case : కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో వాళ్లందరికి నోటీసులు రెడీ..!