Urology Conference In Hyderabad :యూరాలజీ, నెఫ్రాలజీ సేవలకు దేశంలోనే పేరెన్నికగన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక యూరాలజీ సదస్సు రెండో ఎడిషన్ నగరంలో నిర్వహిస్తున్నారు. 'యూరేత్రా ఏఐఎన్‌యూ' పేరుతో నిర్వహిస్తున్న ఈ సదస్సు దేశంలో యూరాలజీ రంగంలో ఒక ప్రధాన మైలురాయి కానుంది.
హాజరవ్వనున్న 800 మంది యూరాలజిస్టులు :ఈ నెల 6, 7 తేదీల‌్లో జేఆర్‌సీ కన్వెన్షన్ అండ్ ట్రేడ్ ఫెయిర్స్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు యూకే, మెక్సికో, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, నేపాల్, బంగ్లాదేశ్, ఆగ్నేయాసియా దేశాలతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 800 మందికి పైగా యూరాలజిస్టులు హాజరవుతున్నారు. మల్లిక్, రాజు, పూర్ణ యూరోకేర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి సహ నిర్వాహకులుగా ఉన్నారు.
Topics To Be Taught In This Conference :యూరాలజిస్టులకు దేశంలోనే అతిపెద్ద సదస్సు అయిన ఇక్కడ 24 లైవ్ సర్జరీలు ప్రదర్శిస్తారు. మూత్రనాళ పునర్నిర్మాణాలలో కొత్త టెక్నిక్‌లు ఇక్కడ నేర్పిస్తారు. ఈ శస్త్రచికిత్సల్లో సంక్లిష్ట అంశాలు, మూత్రనాళం సన్నబడినప్పుడు పిల్లలు, పురుషులు, మహిళల్లో ఎలా చేయాలనేవాటిని చూపిస్తారు.
అత్యాధునిక పద్ధతులపై చర్చ :జన్యుపరమైన ఇంజినీరింగ్ చేసిన సామాగ్రి, రీజనరేటివ్ మెడిసిన్‌లో సెల్ థెరపీ లాంటి అత్యాధునిక పద్ధతుల గురించి కూడా చర్చిస్తారు. పుణెకు చెందిన డాక్టర్ సంజయ్ కులకర్ణి, కోయంబత్తూరుకు చెందిన డాక్టర్ గణేశ్ గోపాలకృష్ణన్ లాంటి యూరాలజీ దిగ్గజాలతో పాటు ఐఎస్‌బీ హైదరాబాద్ మాజీ డీన్ అజిత్ రంగ్నేకర్ ఈ సదస్సులో కీలకప్రసంగాలు చేయనున్నారు.
యూరాలజిస్టులందరికీ విజ్ఞానం పంచడమే లక్ష్యం : ఈ సందర్భంగా ఏఐఎన్‌యూకు చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డాక్టర్ భవతేజ్ ఎన్‌గంటి మాట్లాడుతూ, "మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు చాలా సంక్లిష్టం. వీటిలో వైఫల్యాలు కూడా ఎక్కువే. అందువల్ల బాగా శిక్షణ పొందిన, నైపుణ్యం ఉన్న యూరాలజిస్టుల అవసరం బాగా ఎక్కువ. యూరాలజిస్టులు అందరికీ విజ్ఞానం పంచడం, తద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించడం మా సదస్సు ప్రధాన లక్ష్యం” అని వివరించారు.
About ANIU :భారత్‌లో యూరాలజీ, నెఫ్రాలజీ ఆస్పత్రుల నెట్‌వర్క్‌లో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ప్రముఖమైనది. ఇటీవల దీన్ని ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ టేకోవర్ చేసింది. ప్రముఖ నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులతో కూడిన ఏడు ఆస్పత్రులు దేశంలోని నాలుగు నగరాల్లో ఉన్నాయి. యూరాలజీ, నెఫ్రాలజీ రంగాలలో చికిత్సాపరమైన నైపుణ్యాలతో ఈ ఆస్పత్రి యూరో-ఆంకాలజీ, రీకన్‌స్ట్రక్టివ్ యూరాలజీ, పిల్లల యూరాలజీ, మహిళల యూరాలజీ, ఆండ్రాలజీ, మూత్రపిండాల మార్పిడి, డయాలసిస్ లాంటి సేవలు అందిస్తోంది.
యూరాలజీ, నెఫ్రాలజీ, యూరో-ఆంకాలజీ రంగాల్లో ఇప్పటివరకు 1200 రోబోటిక్ సర్జరీలు చేసి, దేశంలోనే ముందంజలో ఉంది. దేశంలో ఈ ఆస్పత్రికి 500 పడకలు ఉన్నాయి. ఇప్పటివరకు లక్ష మందికి పైగా రోగులకు చికిత్సలు అందించారు. ఏఐఎన్‌యూకు ఎన్ఏబీహెచ్, డీఎన్‌బీ (యూరాలజీ అండ్ నెఫ్రాలజీ), ఎఫ్ఎన్‌బీ (మినిమల్ ఇన్వేజివ్ యూరాలజీ) నుంచి ఎక్రెడిటేషన్ ఉంది.
హైదరాబాద్‌లో వరి శిఖరాగ్ర సదస్సు - దేశంలోనే తొలిసారిగా నిర్వహణ - GLOBAL RICE SUMMIT 2024 IN H YDERABAD
నేటి నుంచి 21వ బయో ఆసియా సదస్సు - జీవవైద్య సాంకేతిక రంగంలో మార్పులు, ఆవిష్కరణలపై చర్చలు