ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల లడ్డూ వివాదం - పవన్​ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాశ్​ రాజ్​ - Prakash Raj Tweet to Pawan Kalyan

Cine Actor Prakash Raj Tweet to Dy CM Pawan Kalyan: సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ విషయం తెలుసుకుని మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్​కల్యాణ్​ అన్నారు. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండని పవన్‌ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రకాశ్​రాజ్​ ఎక్స్​ వేదికగా మాట్లాడారు.

prakash_raj_tweet_to_pawan_kalyan
prakash_raj_tweet_to_pawan_kalyan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2024, 3:34 PM IST

Updated : Sep 24, 2024, 4:47 PM IST

Cine Actor Prakash Raj Tweet to Dy CM Pawan Kalyan:లడ్డూ కల్తీ వ్యవహారమై ఇటీవల నటుడు ప్రకాశ్‌ రాజ్‌ చేసిన ట్వీట్‌ గురించి పవన్‌ కల్యాణ్‌ విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఆ వ్యాఖ్యలపై ప్రకాశ్‌ రాజ్‌ స్పందించి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్‌ కల్యాణ్‌ ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తానని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. ‘పవన్‌ కల్యాణ్‌ మీ ప్రెస్‌మీట్‌ ఇప్పుడే చూశానని నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నానని ఈ నెల 30వ తేది తర్వాత భారత్​కు వచ్చి మీ ప్రశ్నలకు సమాధానం చెప్తానని తెలిపారు. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మరో సారి చదవి. అర్థం చేసుకోండని ప్రకాశ్ రాజ్ అన్నారు.

ఇదీ జరిగింది:తిరుమల లడ్డూ కల్తీపై వస్తున్న ఆరోపణలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, భక్తులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ప్రకాశ్‌ రాజ్‌ పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమైన ఎక్స్​లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్​లో ‘మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగిందని విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేగాని మీరెందుకు అనవసర భయాలు కల్పించి ఈ విషయాన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు ఇంక కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

తెలుసుకుని మాట్లాడండి:దీనిపై పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిని సందర్శించారు. ఈ క్రమంలో పనవన్ ఆలయ మెట్లను శుభ్రం చేసి, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. ఆ తర్వాత మీడియాతో పవన్ మాట్లాడుతూ వైఎస్సార్​సీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నితాంశాలపై ప్రకాశ్‌ రాజ్‌ తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నానని విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండని హితవు పలికారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని’ పవన్‌ వ్యాఖ్యానించారు.

సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకునేది లేదు : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Visits Indrakeeladri

కల్తీ నెయ్యిని చిటికెలో కనిపెట్టేయొచ్చు - ఈ చిట్కాను పాటిస్తే సరి! - Ghee Purity Test At Home

Last Updated : Sep 24, 2024, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details