Praja Samasyala Parishkara Vedika Ongole :ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మీకోసం కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ పాలనలో స్పందన పేరిట తీసుకున్న అర్జీలు పరిష్కరించకపోవటంతో భారీగా దరఖాస్తులు రీ ఓపెన్ అయ్యాయి. ఒంగోలులోలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అధికారులకు వినతులు అందజేశారు. ప్రభుత్వం మారటంతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా స్పందనలో అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చిన సమస్య పరిష్కారం కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Public Problem Solving Platform Will Starts AP :ప్రజల సమస్యలను తెలుసుకొని వంద శాతం పరిష్కారం చూపాలని కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమానికి ప్రజలు తరలి వచ్చారు. వారి నుంచి కలెక్టర్ నిశాంత్‌కుమార్, జేసీ శోభిక, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్, డీఆర్వో ఇన్‌ఛార్జి కేశవనాయుడు అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 124 మంది వినతులు ఇచ్చారు. వీటిలో ఎక్కువగా భూ సంబంధిత సమస్యలే ఉన్నాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు రామచంద్రరావు, రాబర్ట్‌పాల్, సత్యనారాయణ, కృష్ణాజీ, ప్రభాకరరావు, విజయపార్వతి, శివప్రసాద్, శ్రీనివాసరావు, పగడాలమ్మ, అశోక్‌కుమార్, శశికుమార్, శాంతీశ్వరరావు, మహేంద్రకుమార్ పాల్గొన్నారు.