Poor Family Seeking Help For Son Treatment :యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం కొర్రతండాకు చెందిన రమావత్ తులసి-సీతారం కుమారుడు శ్రీను. ఏడో తరగతి వరకి బాగానే పాఠశాలకు వెళ్లాడు. ఆ తర్వాత చిన్నగా కాళ్లు పట్టు కోల్పోయాయి. ఆస్పత్రులకు తీసుకెళ్లగా కండర క్షీణత వ్యాధి వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. క్రమంగా కాళ్లు, చేతులు చచ్చిబడిపోయాయి. ప్రస్తుతం శ్రీను వయస్సు 23 ఏళ్లు. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు.
ఒకరు పనికి వెళితే మరోకరు ఇంటి వద్ద ఉండి శ్రీనును చూసుకోవాల్సిన పరిస్థితి. వయసు మీద పడటంతో వారు పనిచేయలేకపోతుండటంతో కుటుంబపోషణ భారంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్, రేషన్ బియ్యంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన సమయంలో వారికి భారంగా మారానని శ్రీను మనోవేదనకు గురవుతున్నాడు. తనకు వచ్చిన కండరాల క్షీణిత వ్యాధి నయమయ్యే పరిస్థితి లేదు. కన్నవారికి భారం అవుతున్నానని తానూ చనిపోతా అని ఏమైనా విషం ఉంటే ఇవ్వూ అని తల్లిదండ్రులని వేడుకుంటున్నాడు.
'చిన్నప్పుడు బాగానే ఉన్నా. నేను మంచిస్థాయిలో ఉండాలని నా తల్లిదండ్రులు అనుకునే సమయంలో నా పరిస్థితి ఇలా అయిపోయింది. నడవ రాదు కూర్చో రాదు. నేను ఏం చేయాలన్నా మా అమ్మానాన్నలే చూసుకుంటున్నారు. వారికి కూడా వయసు మీద పడటంతో మా పరిస్థితి ఘోరంగా మారింది. మాకు ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాం'- రమావత్ శ్రీను, కండర క్షీణత బాధితుడు