Polluting in Nellore Penna River: నెల్లూరు నగర ప్రజలకు, గ్రామాల్లో ఉన్న మరో 10లక్షల మందికి తాగునీరు అందించే పెన్నమ్మ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఈ నీటిని తాగిన ప్రజలు అరోగ్యం దెబ్బతిని ఆస్పత్రుల పాలవుతున్నారు. పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం నుంచి విడవలూరు వద్ద సముద్రంలో కలిసే వరకు 110 కిలోమీటర్లు పెన్నానది ప్రవహిస్తుంది. వేలాది గ్రామాలను తాకుతూ, లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చే పెన్నానదిని ప్రతి చోటా కలుషితం చేస్తున్నారు. గ్రామాల్లోని మురుగు కాలువలు తీసుకు వచ్చి నదిలో కలుపుతున్నారు. నెల్లూరు కార్పోరేషన్‌లోని 54 డివిజన్ల మురుగునీటిని, వ్యర్థాలను పెన్నానది తీరంలో వదిలేస్తున్నారు.
గోదావరిలో యథేచ్ఛగా ఇసుక డ్రెడ్జింగ్ - పట్టించుకోని అధికారులు - Illegal Sand Mining in Rajahmundry
రక్షిత మంచినీటి పథకాలు, బోర్లు ఉన్న ప్రాంతాల్లోకి మురుగునీరు వెళ్లి తాగునీరు కలుషితం అవుతుంది. అదే నీటిని నగరంలోని ప్రజలకు కుళాయిల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. అధికారులు శుద్ధి చేస్తున్నామని చెబుతున్నా కుళాయిలకు వచ్చే నీరు రంగు మారి దుర్వాసలు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెన్నా నదిలోకి మురుగు నీరు, వ్యర్థాలుకలవడంతో కలుషితమవుతోంది. ఆ నీరే మళ్లీ వాటర్ ట్యాంకుల్లోకి వస్తోంది. దాదాపు 10- 15 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పంట పొలాల్లోకి సైతం నదిలోని నీటి ద్వారానే పంటలు పండించడంతో వాటిని తింటుంటే రోగాల బారిన పడుతున్నాం. ఈ సమస్యపై అధికారులు ఏమి స్పందించలేదు. - స్థానికులు.
పెన్నమ్మ ఊట చెలిమలే దిక్కు- తాగునీటి సమస్యతో తీవ్ర ఇక్కట్లు - Drinking Water Problem
నెల్లూరులో డంపింగ్ యార్డు సమస్య తీవ్రంగా ఉంది. దొంతాలి డంపింగ్ యార్డు నిండిపోవడంతో కొన్నిసార్లు పెన్నానదిలో డంప్ చేస్తున్నారు. ఇళ్లలో ఉన్న సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలను రాత్రి సమయాల్లో నదిలో వదిలేస్తున్నారు. ఆసుపత్రుల వ్యర్థాలు కూడా అందులోనే వేస్తున్నారు. ఇక్కడి రక్షిత పథకాల నీటిని తాగి వాంతులు, విరోచనాలతో తరచూ బాధపడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. జిల్లా, కార్పోరేషన్ అధికారులు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్నానది కాలుష్యం బారిన పడుతున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. రెండు, మూడు సంవత్సరాలు వరదలు రాకుంటే కాలుష్య సమస్య మరింత తీవ్రంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు.
నిధులు మంజూరైనా ముందుకుసాగని నారాయణపురం ప్రాజెక్టు పనులు - Narayanapuram Project Works Delay
కాలుష్య కోరల్లో చిక్కుకున్న పెన్నమ్మ - డ్రైనేజీ, ఇంటి వ్యర్థాలు నదిలో వదలడంతో నీరు కలుషితం (ETV Bharat)