Agniveer Recruitment Rally in Hyderabad: ఇండియన్ ఆర్మీలో చేరాలని చాలా మంది యువత కలలుకంటూ ఉంటారు. అలాంటి వారికి ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. హైదారాబాద్‌లో త్వరలోనే అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన అర్హత, ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ ఆర్మీలో చేరడానికి యువతకు గొప్ప అవకాశం కల్పిస్తోంది ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు. హైదరాబాద్లో 'అగ్నివీరుల రిక్రూట్‌మెంట్' ర్యాలీని ఇండియన్ ఆర్మీ త్వరలోనే నిర్వహించనుంది. ఇందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియం (GMC Balayogi Stadium) వేదిక కానుంది. ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ డిసెంబరు 8వ తేదీ నుంచి డిసెంబరు 16వ తేదీ వరకు (Agniveer Rally from December 8th to December 16th) నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు.
తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన యువకులను సైన్యంలో అగ్నివీరులుగా చేర్చుకోవడానికి రిక్రూట్‌మెంట్ ర్యాలీకి ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
విద్యార్హతలు (Educational Aualifications For Agniveer) : కొన్ని పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత, మరికొన్ని పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
అగ్నివీర్ పోస్టుల వివరాలు: అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్
ఈ పోస్టులకు పదో తరగతి విద్యార్హత: అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వీటికి ఎనిమిదో తరగతి ఉంటే చాలు: అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ పోస్టుకి ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.
మహిళా మిలిటరీ పోలీస్ (Women Military Police) అభ్యర్థులకు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన మహిళా మిలిటరీ పోలీసు అభ్యర్థులకు ఫిబ్రవరి 12, 2024 నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం ర్యాలీ జరిగే ప్రదేశానికి అన్ని డాక్యుమెంట్లను తీసుకురావాలని ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు.
కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త - డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్ట్