ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ - ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు - Political Leaders Cast Their Vote - POLITICAL LEADERS CAST THEIR VOTE

Political Leaders Cast Their Vote in AP: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనిలో భాగంగా రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Political_Leaders_Cast_Their_Vote_in_AP
Political_Leaders_Cast_Their_Vote_in_AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 8:50 AM IST

Updated : May 13, 2024, 12:25 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ - ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు (ETV Bharat)

Political Leaders Cast Their Vote in AP:రాష్ట్ర వ్యాప్తంగా లోక్​సభ, అసెంబ్లీ పరిధిలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఉదయాన్నే వేలాదిగా పోలింగ్ బూత్​ల వద్దకు తరలి వచ్చారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. విజయవాడ రైల్వే కల్యాణ మండపంలోని పోలింగ్‌ కేంద్రంలో సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతోపాటు మొబైల్‌ ఫోన్లు పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించబోమని వెల్లడించారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని ఓటర్లను కోరారు.

"ఓటర్లెవరూ పోలింగ్‌ కేంద్రాలకు మొబైల్‌ ఫోన్లు తేవద్దు. మొబైల్‌ ఫోన్లు పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించం. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలి."- ముఖేష్‌కుమార్‌ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడ రైల్వే కల్యాణ మండపంలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. ముఖ్యమంత్రి జగన్‌ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్సార్​ జిల్లా పులివెందుల బాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లా ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరిలో పవన్‌కల్యాణ్‌ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా యువత- తొలిఓటుతో అభ్యర్థుల తలరాతలు తారుమారు - Youth In AP Assembly Elections

నందిగామలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలిగిరి మండలంలోని పతేగడ పంచాయతీ నగిరిపల్లి 181 పోలింగ్ కేంద్రంలో మాజీ సీఎం రాజంపేట పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి నల్లారి కుమార్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు - పోలింగ్‌ ఏజెంట్లు కిడ్నాప్ - ఎక్కడికక్కడ దాడులు - clashes in ap elections

Last Updated : May 13, 2024, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details