Government Appoints New SIT On Ration Rice Smuggling : రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్ల్మింగ్‌పై విచారణకు ఏర్పాటు చేసిన సిట్ స్థానంలో ప్రభుత్వం కొత్త సిట్‌ను నియమించనుంది. ఇప్పటికే సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఒక ఎస్పీ, నలుగురు డీఎస్పీలతో ఈనెల 6న ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే వైఎస్సార్సీపీ అనుకూలురుగా ముద్రపడ్డ డీఎస్పీలు అశోక్‌వర్థన్ రెడ్డి, ఎం.బాలసుందరరావు, ఆర్.గోవిందరావును సభ్యులుగా నియమించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో వారిని తప్పించి కొత్తగా కూర్పు చేపడుతున్నారు.
ప్రస్తుతం ముగ్గురు డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లతో పాటు పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖాధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నుంచి కొందరినీ సిట్‌లోకి తీసుకోనున్నారు. అందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది. కాకినాడ కేంద్రంగా ఏర్పాటైన మాఫియాపై 13 కేసులు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మరికొన్ని ముఖ్యమైన స్మగ్ల్మింగ్ కేసుల్ని సైతం సిట్ విచారించనుంది. దందా వెనక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే విషయాన్ని తేల్చనుంది.
బియ్యం ఎగుమతుల్లో కాకినాడ 'కీ' పోర్టు - అంతర్జాతీయస్థాయిలో రేషన్ మాఫియా!
NEW SIT Inquiry on PDS Rice Smuggling : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొత్త ఏర్పాటైనప్పటి నుంచి మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. ఓవైపు స్టెల్లా నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాల పరిశీలన జరగుతుండగా సిట్ విచారణ దూకుడుగా సాగే అవకాశం ఉంది. అక్రమాలకు అండదండగా ఉంటున్న పెద్దలపాత్ర తేలనుంది. రాష్ట్రంలో ఎన్ని పోర్టులున్నా వివాదాల సుడిలో చిక్కింది మాత్రం కాకినాడ పోర్టే.
రాష్ట్రప్రభుత్వ మారిటైం బోర్డు పర్యవేక్షణలోని కాకినాడ పోర్టును ప్రైవేట్ వ్యక్తులు, రాజకీయ నేతలు తమ గుప్పెట్లోకి తీసుకుని అక్రమ ఎగుమతులు, అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా మార్చారనే విమర్శలున్నాయి. విదేశాలకు బియ్యం ఎగుమతుల ముసుగులో పేదల బియ్యాన్ని దేశం దాటించిన అక్రమార్కుల ఆటలు ఇప్పుడూ అలాగే సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో పౌరసరఫరాల వ్యవస్థలో క్షేత్రస్థాయి లోపాలు కొందరికి ఆదాయవనరుగా మారాయి.
పేదలకు పంపిణీ చేసే కేజీ బియ్యానికి ప్రభుత్వం రూ.43.50 వెచ్చిస్తుంది. దానిని లబ్ధిదారుల నుంచి కొన్ని ముఠాలు కేజీ రూ.10కి కొంటున్నాయి. ఆ బియ్యాన్ని మిల్లుల్లో పాలిష్ చేయించి పోర్టుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ శాఖలు చూసీచూడనట్లు వదిలేస్తున్నాయి. దీంతో రాజకీయదన్నుతో రాష్ట్ర నలుమూలల నుంచి కాకినాడకు అక్రమ నిల్వలు చేరుకుంటున్నాయి. పోర్టు, కస్టమ్స్, మెరైన్, పౌరసరఫరాలు, పన్నుల శాఖ, రవాణా, పోలీసులు ఇలా అందరి తనిఖీలు సవ్యంగానే ఉన్నట్లు చెబుతున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో రేషన్ మాఫియా - వివిధ రాష్ట్రాల నుంచి కాకినాడ పోర్టు వరకూ
కాకినాడ పోర్టులో 1,320 టన్నుల పీడీఎస్ రైస్ - వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు : కలెక్టర్ షాన్ మోహన్