Wedding Card Found the Culprit :కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరకు కన్న కుమారుడునే (ఆరు నెలల పసికందు) అతి కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అది కూడా ఒకటి, రెండు ఏడాదిలు కాదు ఏకంకా 26 ఏళ్లు. ఇప్పుడు ఎట్టకేలకు అతడు పాపం పండింది. ఎవరికీ కనిపించకుండా సుదూర ప్రాంతంలో మారుపేరుతో కొత్త జీవితాన్ని ఆరంభించి హాయిగా కాలం గడిపేస్తున్న ఆ హంతకుడు జాడను, అతడి కుమార్తె పెళ్లిపత్రిక మాత్రం పట్టించి కటకటాల్లోకి నెట్టింది. ఈ ఘటన ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను సోమవారం పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రత్న కేసు ఛేదించిన తీరును వివరించారు.
చిన్న క్రైం స్టోరీ కాదు : శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం దిన్నెహట్టి విలేజ్కు చెందిన తిప్పేస్వామి తన భార్య కరియమ్మపై అనుమానం పెంచుకున్నాడు. 1998 సంవత్సరం దసరా నాడు గుడిలో పూజ చేయాలని ఆరు నెలల తన రెండో కుమారుడు శివలింగమయ్యను, భార్యను తిప్పేస్వామి దగ్గర్లో ఉన్న ఆలయానికి వెంటబెట్టుకుని తీసుకెళ్లాడు. భార్య ప్రదక్షిణ చేస్తుండగా కుమారుడిను లాక్కొని సమీప మామిడి తోటలోకి వెళ్లాడు. ఆ సమయంలో కుమారుడిని గొంతు నులిమి హతమార్చి అనంతరం గొయ్యి తీసి అందులో ఆ పసివాడ్ని పూడ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. తన భర్త చేసిన ఘాతుకానికి అదే ఏడాది సరిగ్గా అక్టోబరు 18న గుడిబండ ఠాణాలో భార్య కరియమ్మ కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలించినా ఫలితం లేకుండాపోయింది.
పెండింగ్ కేసులపై స్పెషల్ ఫోకస్ :శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో పెండింగ్ కేసులపై ఎస్పీ రత్న దృష్టి సారించారు. ఆ పసికందు హత్య కేసుకు సంబంధించిన విచారణ బాధ్యతలను డీఎస్పీ వెంకటేశ్వర్లు తీసుకున్నారు. ఇదే టైంలో దిన్నేహట్టి గ్రామానికి చెందిన బాంబే నాగరాజు, నిందితుడు తిప్పేస్వామిని కలిసినట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.