Police Instructions About Sandhya Theatre Incident :సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అల్లు అర్జున్ థియేటర్‌కు రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసినట్లు తమ దృష్టికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఘటన పై విచారణ జరుగుతున్న క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిందన్నారు.
కొందరు ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడుతున్నట్టు తెలిసిందని అటువంటి వారి పై చర్యలు తప్పవన్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేసే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసు శాఖను బద్నాం చేసే విధంగా తప్పుడు పోస్టులు పెడితే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చని పోలీసులు సూచించారు. సొంత వ్యాఖ్యలు చేయవద్దని, సామాజిక మాధ్యమాలలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పోలీసు శాఖ తరపున అధికారులు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
'రేవతి చనిపోయిందని థియేటర్‌లో నాకు చెప్పలేదు' - భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్