Police Constable Families Protest at Secretariat : తెలంగాణలో పోలీసులు కుటుంబాలు రోడ్డెక్కాయి. ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలనే డిమాండ్‌తో ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో పోలీస్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వారి భార్యలు ఆందోళనకు దిగారు. వారంతా సచివాలయం ముట్టడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి చేసింది. పలువురు అరెస్టు అయ్యారు.
గడ్డి తీయిస్తున్నారు: ఏక్ పోలీస్ విధానాన్ని అమలుచేసి, ఒకే దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఒకే దగ్గర 3 నుంచి ఐదేళ్లు పోస్టింగ్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఒకే నోటిఫికేషన్, ఒకే పరీక్ష పెట్టినప్పుడు అందరికి ఒకేలా ఉద్యోగం ఉండాలి కానీ తమ భర్తలకే ఎందుకు కుటుంబాలకు దూరంగా ఉండే విధంగా ఉందని ప్రశ్నించారు. మట్టి, ఇటుకలు మోపిస్తున్నారని, గడ్డి తీయిస్తున్నారని వాపోయారు. ఎంతో కష్టపడి పరీక్ష రాసి జాబ్ తెచ్చుకుంటే, కూలల కంటే దారుణంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కూలీలా లేదంటే ఖాకీలా?:బెటాలియన్ కానిస్టేబుళ్లను కూలీలకంటే దారుణంగా చూస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి, ఇటుకలు మోయిస్తున్నారని, గడ్డి తీపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిక్రూట్మెంట్ విధానంలో ప్రత్యేక బలగాలుగా కొంతమంది ఉద్యోగులను తీసుకుంటారని, బెటాలియన్ల ఉద్యోగాలు చేయడం వల్ల తమ కుటుంబాలకు దూరమవుతున్నామని వాపోయారు. భారీ సంఖ్యలో వచ్చిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు.