ETV Bharat / state

జోగి రమేష్‌, దేవినేని అవినాష్‌ దేశం వదిలి వెళ్లొద్దు - విచారణకు సహకరించాలి: సుప్రీంకోర్టు - SC ON ATTACK OF TDP OFFICE CASE

చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుపై సుప్రీంకోర్టు విచారణ- మూడేళ్లు దర్యాప్తు జరపకుండా తాత్సారం చేశారన్న సుప్రీంకోర్టు

Supreme Court
Supreme Court (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2025, 12:41 PM IST

Updated : Feb 25, 2025, 1:07 PM IST

Supreme Court on Attack of Chandrababu House and TDP Office Case: చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జోగి రమేష్‌, దేవినేని అవినాష్‌ వేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం దేవినేని అవినాష్‌, జోగి రమేశ్‌ సహా 20 మందికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు జోగి రమేష్‌, దేవినేని అవినాష్‌ దర్యాప్తునకు సహకరించాలని, అలానే దేశం వదిలి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నిందితులకు తప్పు చేశామని తెలుసు: ఈ కేసులో మూడేళ్లు దర్యాప్తు జరపకుండా తాత్సారం చేశారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పూర్తిగా క్రిమినల్‌ ప్రొసీజర్ కోడ్‌ను ఉల్లంఘించారని మండిపడింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు కారణాలు కనిపించలేదని, హైకోర్టు ఉత్తర్వులపై నిందితులు పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం తరుపున వాదించిన న్యాయవాదులు నిందితులు మూడేళ్లుగా బెయిల్‌, ముందస్తు బెయిల్‌ కోరలేదని ధర్మాసనానికి తెలిపారు.

ప్రభుత్వం మారిన తర్వాతే కోర్టు మెట్లు ఎక్కారని, నిందితులకు తాము తప్పు చేశామని తెలుసని అన్నారు. ప్రభుత్వం మారాక తప్పు బయటపడుతుందని కోర్టుకు వచ్చారని వివరించారు. జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం ఇంటిపై దాడి చేయడమే కాక ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని ధర్మాసనానికి విన్నవించారు. టీడీపీ ఆఫీసుపై దాడిలో దేవినేని అవినాష్‌ ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని, అతను దర్యాప్తునకు ఏమాత్రం సహకరించటం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

వల్లభనేని వంశీ భూకబ్జాలపై సిట్‌ దర్యాప్తు వేగవంతం - మరో 2 కేసులు నమోదు

ఫలించిన అగ్రిగోల్డ్​ బాధితుల నిరీక్షణ - ఆస్తుల పంపిణీకి మార్గం సుగమం

Last Updated : Feb 25, 2025, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.