Petrol Pump Fraud Electronic Chips : పెట్రోల్ బంకుకు వెళ్లగానే బైక్ లేదా కారులో సరిపడా డబ్బులిచ్చి రూపాయలు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకుంటాం. అక్కడ పని చేసే సిబ్బంది మన ఎదురుగానే నెంబర్లు నొక్కి పెట్రోల్ లేదా డిజీల్ నింపుతుంటారు. అంతా బాగానే ఉంది కదా, ఇందులో ఏ మాయ లేదు అని అనుకుంటాం మనందరం. కానీ, అక్కడే ఉంది అసలు కిటుకంతా! అయితే, రాష్ట్రంలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో నకిలీ ఎలక్ట్రానిక్ చిప్‌లు అమర్చి తక్కువ పరిమాణంలో పెట్రోల్, డీజీల్ కొడుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో వెలుగుచూసింది.

పెట్రోల్ పంపులో ప్రవాహానికి అంతరాయం కలిగించేలా ఒరిజినల్ సర్క్యూట్‌ను మళ్లించి ప్రతి 10 లీటర్లకు 1 లీటర్ చొప్పున డీలర్లు అనుచిత లబ్ధి పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే లీటర్ పెట్రోల్ లేదా డిజీల్‌పై వినియోగదారులు 100 ml వరకు నష్టపోతున్నారన్న మాట! ఇంత పెద్ద మొత్తంలో మోసాలకు కొందరు డీలర్లు పాల్పడుతున్నారు.
'మా ఆయన తప్పు చేశానంటున్నాడు - ఇప్పుడు నా భర్తను క్షమించాలా? వద్దా?'

అలాగే పలు చోట్ల ధరలకు సంబంధించిన బోర్డులు ప్రదర్శించడం లేదని, కల్తీ తనిఖీని గుర్తించే విధానానికి సంబంధించిన పోస్టర్లు ప్రదర్శించడం లేదని గుర్తించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హరీష్‌కుమార్ గుప్తా ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురాల్లోని మొత్తం 73 పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ బృందాలు ఈ నెల 22న ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. అందులో వెలుగుచూసిన అక్రమాలు, ఉల్లంఘనలను డీజీ హరీష్‌కుమార్ గుప్తా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు-
- అనంతపురం జిల్లాలోని ఆత్మకూరు మండలం సనప గ్రామంలోని ఎస్‌పీ అండ్ సన్స్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పల్సర్ బోర్డులు ట్యాంపరింగ్ చేశారు. డిస్పెన్సింగ్ యూనిట్లలో రెండు చిప్‌లు అదనంగా అమర్చారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
- కర్నూలులోని ఓ పెట్రోల్ బంకుకు సంబంధించిన డిస్పెన్సరీ యూనిట్‌లో క్రమరహిత డెలివరీ ఉన్నట్లు గుర్తించాం. దీనిపై కేసు నమోదు చేసి అపరాధ రుసుము విధించాం.
- రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరుల్లోని కొన్ని బంకుల్లో కొలతల్లో తేడా ఉంది.
- వీరందరిపై కేసులు నమోదు చేశాం. అలాగే పెట్రోల్, డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నాం.
- పెట్రోల్ బంక్ డీలర్లు ఎవరు కూడా ఇలాంటి అక్రమాలు, ఉల్లంఘనలకు పాల్పడొద్దని డీజీ హరీష్‌కుమార్ గుప్తా హెచ్చరించారు. ఎప్పుడైనా ఆకస్మిక దాడులు కొనసాగుతాయని తెలిపారు.
"వర్క్ ఫ్రమ్ హోమ్" అడిగితే ఉద్యోగం తీసేశారు! - కట్ చేస్తే, కోటి పరిహారం అందుకుంది!
డ్రై ఫ్రూట్స్ నానబెడుతున్నారా? - మీకు ఈ విషయాలు తెలుసా? - నిపుణులు ఏమంటున్నారంటే!