ప్రభుత్వ, సాప్ట్వేర్ ఉద్యోగులు, సినీ కళాకారులు అంతా ఒకేచోట- రేవ్‌పార్టీ భగ్నం - rave party in hyderabad - RAVE PARTY IN HYDERABAD
Rave party Busted in Hyderabad : ఓ గెస్ట్‌హౌస్‌లో సాప్ట్వేర్ ఉద్యోగులు నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 18 మంది యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి గంజాయి, ఈ-సిగరెట్లు, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 11, 2024, 12:28 PM IST
Rave Party in Gachibowli : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ గెస్ట్‌హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. నిందితుల నుంచి గంజాయి, ఈ-సిగరెట్లు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రేవ్ పార్టీని సాప్ట్వేర్ ఉద్యోగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 18 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, సాప్ట్వేర్ ఉద్యోగులు, సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు.