Police Arrested Accused in Acid Attack Case on Woman: యువతిపై యాసిడ్ దాడి చేసిన నిందితుడు గణేష్‌కు కచ్చితంగా శిక్ష పడుతుందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లాలో శుక్రవారం ఓ యువతిపై గణేష్ అనే యువకుడు యాసిడ్‌తో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిందితుడు గణేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టు సందర్బంగా పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
ఈ ఘటన జరిగిన 24 గంటలలోపే నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితుడు యువతిపై యాసిడ్ దాడి చేసి బెంగళూరుకు పారిపోతుండగా పట్టుకున్నామని వెల్లడించారు. తనకు దక్కని అమ్మాయి మరెవరికి దక్కకూడదన్న కక్షతోనే పథకం ప్రకారం నిందితుడు యాసిడ్ దాడి చేశాడని తెలిపారు. బాధితురాలిని మెరుగెన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించామని వెల్లడించారు. కళాశాలలు, విద్యాసంస్థల్లో భరోసా అనే కార్యక్రమం ఐసీడీఎస్, పోలీసు, విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు.