Police Arrested a Bangladeshi Woman Prostitution Case :డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి అక్రమ మార్గంలో సుమారు రెండు నెలల కిందట భారత్‌లోకి అడుగుపెట్టింది. కోల్‌కతా నుంచి నేరుగా సికింద్రాబాద్‌కు రైల్లో చేరుకుంది. అక్కడి నుంచి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో నివసించే దంపతుల వద్దకు చేరింది. వారు ఆ యువతితో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు ఆర్జించసాగారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆ మహిళ వారికి చెప్పాపెట్టకుండా అత్తాపూర్‌లోని ఓ కస్టమర్ వద్దకు వెళ్లేందుకు బయల్దేరింది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆ దంపతులు, ఆమెను వెంబడించి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Prostitution With Bangladeshi Girl in Hyderabad :ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్ కాలనీలో షేక్ సోనియా(27), మహ్మద్ సల్మాన్(24) దంపతులు నివాసం ఉంటున్నారు. వస్త్ర దుకాణంలో పని చేసే మహ్మద్ సల్మాన్ షేక్ సోనియాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె భారత్‌కు చెందిన వ్యక్తికి, బంగ్లాదేశ్‌కు చెందిన మహిళకు పుట్టిన సంతానం. దీంతో షేక్ సోనియాకు కోల్‌కతా నగరంతో మంచి సంబంధాలు ఉన్నాయి.
Prostitution: 'ఆన్‌లైన్’ వ్యభిచారం.. బంగ్లాదేశ్ యువతి రిమాండ్
మయన్మార్, బంగ్లాదేశ్ దేశస్థులు పరస్పరం మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్ ఉంది. ఈ యాప్‌లో షేక్ సోనియా చాటింగ్ చేస్తుండగా, బంగ్లాదేశ్ వొర్సిండి మండలం రాయ్‌పూర్ గ్రామానికి చెందిన స్రిస్టీ అక్తర్‌తో (22) పరిచయం ఏర్పడింది. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో హైదరాబాద్‌లో తనకు డబ్బు సంపాదించేందుకు ఉద్యోగం దొరుకుతుందా అని స్రిస్టీ అక్తర్ ఆమెను అడిగింది. ఇళ్లలో పని చేసే ఉద్యోగమైతే నెలకు రూ.10,000లు వస్తాయని, వ్యభిచార వృత్తిలోకి (Prostitution) వస్తే నెలకు రూ.20,000లు వస్తాయని షేక్ సోనియా ఆ యువతికి చెప్పింది. డబ్బు కోసం తాను ఏ పనైనా చేస్తానని స్రిస్టీ అక్తర్ తెలిపింది.
భారత్‌లోకి ఎలా ప్రవేశించాలని షేక్ సోనియాను స్రిస్టీ అక్తర్ అడిగింది. అందుకు షేక్ సోనియా ఆ యువతితో ఆ రిస్కు నీవే తీసుకోవాలని చెప్పింది. ఒక వేళ ఇక్కడికి వస్తే తనకు ఫోన్ చేయాలని సెల్‌ఫోన్ నంబరు ఇచ్చింది. రెండు నెలల క్రితం స్రిస్టీ అక్తర్ బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి అక్రమ మార్గంలో కోల్‌కతాకు చేరుకుంది. అక్కడి నుంచి రైలులో నేరుగా సికింద్రాబాద్‌కు వచ్చి షేక్ సోనియాకు ఫోన్ చేసింది. దంపతులు వెళ్లి ఆమెను చాంద్రాయణగుట్టలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. వారు ఆమెతో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టారు.