ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా జింక చర్మాలు స్వాధీనం - కర్ణాటకకు తరలిస్తుండగా పట్టివేత - ILLEGAL TRAFFICKING OF DEER SKINS

జింక చర్మాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులు - 24 జింక చర్మాలు, రెండు కొమ్ములు స్వాధీనం

illegal_trafficking_of_deer_skins.
illegal_trafficking_of_deer_skins. (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 4:49 PM IST

Police Arrest People Illegally Transporting Deer Skins:జింక చర్మాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 24 జింక చర్మాలు, రెండు కొమ్ములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని వజ్రకరూరు మండలం కొనకొండ్ల వద్ద జింక చర్మాలు, కొమ్ములను అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్​ఐ నాగస్వామి తెలిపారు.

గుంతకల్లుకు చెందిన షికారి దేవరాజు, షికారి గోవిందు, షికారి బాబు, వడ్డే చిన్న ఫయాజీ అలియాస్ పెద్ద అంజి, షికారి బాలరాజులు గుంతకల్లు, ఆలూరు, చిప్పగిరి ప్రాంతాల్లో ఉచ్చులు ఏర్పాటు చేసి జింకలను వేటాడేవారు. వాటిని చంపి మాంసం విక్రయించి, చర్మాన్ని కర్ణాటకలోని బళ్లారి, కంప్లి, హొసపేటె ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. జింక చర్మాలను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారంతో అటవీ శాఖ అధికారులు, వజ్రకరూరు పోలీసులు కలిసి దాడి చేసి సంచుల్లో ఉన్న చర్మాలు, కొమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు ఎస్​ఐ నాగస్వామి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details