Polavaram Rehabilitation Victim Farmer Attempt Suicide :అల్లూరి జిల్లా దేవీపట్నంకు చెందిన ఉండమట్ల సీతారామయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోలవరం నిర్మాణం కోసం వీరి ఇల్లు, భూమి కోల్పోగా పరిహారం వచ్చింది. కొంత భూమికి సంబంధించి నష్టపరిహారం విషయంలో వివాదం తలెత్తడంతో అది న్యాయస్థానంలో ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం సీతారామయ్యకు 6.36 లక్షల రూపాయలు, 5 సెంట్ల స్థలం, ఇల్లు నిర్మించి అప్పగించాల్సి ఉన్నప్పటికీ అవేవీ దక్కలేదు. రాజమహేంద్రవరంలో కుమారుడు నాగేశ్వరరావు వద్ద ఉన్న సీతారామయ్య శుక్రవారం ఇంటి నుంచి బయలుదేరి ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్లారు.
అక్కడి పరిపాలనాధికారి సెలవులో ఉండటంతో ఏవో అర్జునరావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఆరేళ్లుగా తిరుగుతున్నా, తమకు న్యాయం జరగ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడివారు పునరావాస ప్యాకేజీ ఫైలు రంపచోడవరం సబ్ కలెక్టరు వద్ద పెండింగ్‌లో ఉందని కొంత దురుసుగా సమాధానం చెప్పినట్లు సమాచారం. దీంతో సీతారామయ్య మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి బయటకు వెళ్లిన ఆయన అరగంట తర్వాత తిరిగొచ్చి ఆ కార్యాలయం గడప మీదే శీతలపానీయంలో పురుగుమందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
Polavaram Rehabilitation Victims పోలవరం నిర్వాసితులను వెంటాడుతున్న సమస్యలు.. ఇళ్లు ఖాళీ చేయాలని అధికారుల హుకుం
పరిహారం కోసం తన తండ్రి ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని సీతారామయ్య కుమారుడు నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కార్యాలయానికి వెళ్లిన ఆయన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తమ గ్రామ వాట్సప్ గ్రూపులో ఎవరో పెడితే తమకు తెలిసిందన్నారు. అక్కడి అధికారులు, సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు తప్ప.. తమకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
No Medical Facility For Polavaram Evacuees: మంచాన పడుతున్న పోలవరం నిర్వాసితులు.. పట్టించుకున్న నాథుడే కరవాయే
పోలవరం త్యాగధనులకు ఆత్మహత్యలే శరణ్యమా?!- పరిహారం కోసం కార్యాలయంలోనే పురుగుల మందు తాగిన వృద్ధుడు (ETV Bharat) దేవీపట్నం మండలంలోని 44 ముంపు గ్రామాలకు చెందిన సుమారు 1,100 మందికి పైగా పోలవరం నిర్వాసితులను అనర్హులుగా గుర్తించడంతో పరిహారం కోసం వారు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మూడేళ్ల క్రితం వారిని కట్టుబట్టలతో గ్రామాల నుంచి జగన్ ప్రభుత్వం ఖాళీ చేయించింది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో పునరావాసం చూపలేదు. ప్యాకేజీ కోసం వారంతా పోరాడుతున్నారు. అధికారుల తప్పిదాల వల్ల ఓ కుటుంబంలో తండ్రికి పరిహారం వస్తే కుమారులకు రాకపోవడం, అన్నకు ఇచ్చి తమ్ముడికి మొండిచేయి చూపడం వంటివి ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని తహసీల్దారు కార్యాలయానికి వెళ్తున్న వారిని రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లమని చెబుతున్నారు. అక్కడికి వెళ్తే ధవళేశ్వరం వెళ్లమంటున్నారని బాధితులు వాపోతున్నారు. తీరా ధవళేశ్వరం వస్తే ఫైలు రంపచోడవరంలోనే ఉందన్న సమాధానం వస్తోందంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుర్తున్నామా జగనన్నా - మేమే పోలవరం నిర్వాసితులం - మాకిచ్చిన హామీలెక్కడ