PM Narendra Modi Going To open Railway Projects : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రంలోని పలు రైల్వే అభివృద్ధి (Railway Projects in Telangana) పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా 500పైగా అమృత్ భారత్ స్టేషన్ల పనులను ప్రారంభించనున్నారు. 1500 రైల్ ఫ్లై ఓవర్, అండర్ పాస్‌లకు భూమి పూజ చేయడంతో పాటు జాతికి అంకితం చేస్తారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకు పైగా నిధులతో 17 రైల్వే ఫ్లె ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. అంతేకాకుండా రూ.221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్వే ఫ్లై ఓవర్, రైల్ అండర్ పాస్‌లను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టుల మొత్తం విలువ దాదాపు రూ.621 కోట్లు కాగా, రాష్ట్రంలో మొత్తం 40 అమృత్ భారత్ స్టేషన్లు పునరాభివృద్ధికి రూ.224 కేట్లు ఖర్చు చేస్తున్నారు.
6 గ్యారంటీలు అమలు చేయమంటే, లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని అడగడం ఏంటి? : కిషన్‌రెడ్డి
ఇందులో రూ.894 కోట్ల అంచనా వ్యయంతో గత ఆగస్టులో 21 అమృత్ భారత్ (Amrit Bharat Programs) స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాగా తెలంగాణలో కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.