PM Modi Virtually Inaugurates Key Railway Projects :భారతీయ రైల్వే ఆధునీకరణలో భాగంగా నేడు దేశవ్యాప్తంగా రూ.85 వేల కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతి ద్వారా జాతికి అంకితం చేశారు. 10 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరియు ఇతర రైలు సేవలకు జెండా ఊపి ప్రారంభించారు. అందులో భాగంగా మెదక్ జిల్లా రామయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్లో(Railway Station) రైల్వే అధికారులు హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ శ్రీ తేజ, మరియు అక్కన్నపేట ప్రజాప్రతినిధులు గ్రామస్తులు వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్, వన్ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ లో తెలంగాణ పిండి వంటకాలు రైల్వే ప్రయాణికుల కోసం నేటి నుంచి అందుబాటులో ఉంచారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేసి ప్రధాని మోడీ ప్రసంగాన్ని మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలను వీక్షకులు చూసేందుకు ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ టు విశాఖపట్నం రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
PM Modi Virtually Inaugurates Dichpally Goods Shed :నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో నూతనంగా నిర్మించిన గూడ్స్ షెడ్‌ను(Goods Shed) ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ వేదికగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే(MLA) ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ డిచిపల్లిలో గూడ్స్ షెడ్ నిర్మించడంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ(PM MODI) గత పదేళ్ల కాలంలో దేశంలో రైల్వే వ్యవస్థను వేగవంతంగా అభివృద్ధి చేశారన్నారు. మోదీ హయాంలో 85%ఎలక్ట్రానిక్ రైల్వే పనులను పూర్తి చేశారని అన్నారు. దేశాభివృద్ధిలో రైల్వే వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని రైల్వే ద్వారా రవాణా పెంచే విధంగా మోదీ ప్రభుత్వం(Government) కృషి చేస్తుందని తెలిపారు. దేశంలోని అన్ని రైల్వే స్టేషన్ లను ఈ కార్యక్రమంలో డిచిపల్లి ఎంపీపీ గద్దె భూమన్న, రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.