PM Modi Telangana Tour Updates : ప్రధాని మోదీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. శుక్రవారం మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో రోడ్ షో నిర్వహించిన ప్రధాని ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి శంఖారావం (Lok Sabha Elections 2024) పూరించనున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నాగర్‌కర్నూల్ వేదికగా జరిగే విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు.
హైదరాబాద్ నుంచి హెలిక్టాప్టర్‌లో మధ్యాహ్నాం 11:45 గంటలకు నాగర్‌కర్నూల్ చేరుకోనున్నమోదీ (PM Modi) 12:00 గంటల నుంచి 1:00 గంటల వరకూ అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ అభ్యర్థిగా డీకే అరుణ (Mahabubanagar BJP Candidate DK Aruna), నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా భరత్ ప్రసాద్‌ను ప్రకటించిన నేపథ్యంలో వారి గెలుపే లక్ష్యంగా మోదీ బహిరంగసభ సాగనుంది. రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి లక్షమందిని తరలించాలని నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్‌షో - కాషాయమయమైన రహదారులు
BJP Vijaya Sankalpa Sabha in NagarKurnool :తెలంగాణాలో పాలమూరును బీజేపీ మొదటి నుంచి సెంటిమెంట్‌గా భావిస్తోంది. 2023 శాసనసభ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికల్లో మోదీ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నేపథ్యంలోనే నాగరకర్నూల్ వేదికగా పదేళ్లలో కేంద్ర సర్కార్ చేసిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమ పథకాల్ని మోదీ వివరించే అవకాశం ఉంది.