తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు - కొత్త షెడ్యూల్ ఇదే - Pm Modi Telangana Tour Schedule

PM Modi Telangana Tour Schedule : ప్రధాని నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 15,16,18 తేదీల్లో తెలంగాణకు రానున్నారు. ఈ నెల 15వ తేదీన మల్కాజ్​గిరి పార్లమెంట్ పరిధిలో భారీ రోడ్ షోలో పాల్గొంటారు. 16వ తేదీన నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో, 18న జగిత్యాలలో ఎన్నికల సభకు హాజరవుతారు.

PM Modi Telangana Election Campaign Schedule 2024
PM Modi Telangana Tour Schedule

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 2:48 PM IST

PM Modi Telangana Tour Schedule :తెలంగాణ లోక్​సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నబీజేపీ ఎన్నికలప్రచారంలో స్పీడు పెంచింది. తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే ఒక దఫా తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ ఈ నెల 15, 16, 18 తేదీల్లో మరోసారి పర్యటించనున్నారు. జగిత్యాల, నాగర్​ కర్నూల్, మల్కాజిగిరిల్లో జరిగే ప్రధాని సభలకు బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

PM Modi Telangana Election Campaign Schedule 2024 : ఈ నెల 15వ తేదీన మల్కాజ్​గిరి పార్లమెంట్ పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించాలని బీజేపీరాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. దాదాపు గంటన్నరకు పైగా రోడ్ షో నిర్వహించాలని భావిస్తోంది. అమిత్ షా సమావేశం అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు సమావేశమై రోడ్ షో గురించి చర్చించారు. రేపు రాష్ట్ర కార్యాలయంలో మల్కాజ్​గిరి రోడ్ షోపై సన్నాహక సమావేశం జరగనుంది. 16వ తేదీన నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 18న జగిత్యాలలో మోదీ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.

సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

PM Modi Lok Sabha Campaign in Telangana: ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రానికి రానున్నారని జాతీయ బీసీ మాజీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి తెలిపారు. బీజేపీ నాయకులతో కలిసి బహిరంగ సభాస్థలిని పరిశీలించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని స్థానిక నాయకులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ పార్లమెంటు అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ మొట్ట మొదటిగా ఎన్నికల ప్రచార సభను ఇక్కడి నుంచి ప్రారంభం చేయనున్నట్లు వివరించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించవలసిన వ్యూహాలను వివరిస్తూ పార్లమెంటు పరిధిలో నాయకులు కార్యకర్తలను చైతన్యం చేస్తున్నారన్నారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించేందుకే బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు ఈ సభకు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

డిచ్​పల్లి గూడ్స్ రైల్ షెడ్​ను వర్చువల్​గా ప్రారంభించిన ప్రధాని మోదీ

సికింద్రాబాద్​ టు విశాఖపట్నం​ రెండో వందేభారత్​ ఎక్స్​ప్రెస్​ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details