తెలంగాణ

telangana

ETV Bharat / state

రాధాకిషన్‌ రావు నేతృత్వంలోనే ఆధారాల ధ్వంసం! - తొలిరోజు విచారణలో వెలుగులోకి - Phone Tapping Case Updates - PHONE TAPPING CASE UPDATES

Telangana Phone Tapping Case Updates : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మొదటి రోజు కస్టడీ ముగిసింది. దర్యాప్తు బృందం అతన్ని విచారించి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లకే పరిమితం కాలేదని, ఆధారాల ధ్వంసం కుట్రలోనూ ఆయన పాత్ర ఉందని తాజా విచారణలో వెల్లడయ్యింది

EX DCP Radhakishan Rao into custody
Telangana Phone Tapping Case Updates

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 7:14 AM IST

ఫోన్ ట్యాపింగ్ కేసు - ఆధారాల ధ్వంసంలో రాధాకిషన్‌ రావు పాత్ర

Telangana Phone Tapping Case Updates : ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు గత నెల 28న అరెస్ట్​ కాగా, తర్వాత నాంపల్లి న్యాయస్థానం అనుమతితో గురువారం నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఈ నెల 10 వరకు విచారణ కొనసాగనున్న నేపథ్యంలో కుట్రకోణం గురించి దర్యాప్తు బృందం లోతుగా ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఎస్ఐబీ ఆధారాల ధ్వంసం వెనక రాధాకిషన్ రావు పాత్రను గుర్తించారు. ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైళ్లను రూపొందించి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడటం ద్వారా సేకరించిన సమాచారం బయటకి వస్తే, తమ భండారం బయటపడుతుందనే భయంతోనే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు (Praneeth Rao), భుజంగ రావు, తిరుపతన్నతో కలిసే ఆధారాల ధ్వంసానికి కుట్ర పన్నినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది.

EX DCP Radhakishan Rao in custody :అందరూ సమష్టిగా నిర్ణయం తీసుకునే ఎస్ఐబీలోని రికార్డులను కాల్చేయడంతోపాటు హార్డ్ డిస్క్‌లను కట్టర్లతో ధ్వంసం చేయాలని నిర్ణయించినట్లు విచారణలో వెల్లడయ్యింది. ఫోన్ ట్యాపింగ్ వ్వవహారంలో మరింత లోతుగా సమాచారం సేకరించే దిశగా రాధాకిషన్‌ రావును పోలీసులు విచారిస్తున్నారు. అయితే తొలిరోజు పోలీస్ కస్టడీలో ఆయన పెద్దగా స్పందించలేదని సమాచారం. హార్డ్ డిస్క్‌ల ధ్వంసం వ్యవహారాన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాల సేకరణలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. ఎన్నిల ఫలితాలు వెలువడిన మరుసటి రోజైన డిసెంబరు 4న ఎస్ఐబీ(SIB)లో కట్టర్లతో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసిన ఆనంతరం వాటిని నాగోల్ వంతెన కింద మూసీ నదిలో పడేశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు- రాధాకిషన్‌రావుకు 7 రోజుల పోలీసు కస్టడీ - phone tapping case update

ఆధారాల సేకరణపైనే దృష్టి : అయితే అవి బురదనీటిలో తడిసిపోవడంతో వాటిల్లోని డేటాను రిట్రీవ్(Retrieve) చేయడం కష్టతరంగా మారింది. అయినాసరే అవే కీలక సాక్ష్యాధారాలు కావడంతో ఆ దిశగా ప్రయత్నిస్తూనే ధ్వంసం కుట్రను నిరూపించేందుకు అవసరమైన ఆధారాల సేకరణపైనా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసేందుకు వినియోగించిన ఎలక్ట్రికల్ కట్టర్లను, బ్లేడ్లను, పత్రాలను భద్రపరిచిన స్పైరల్ టైండింగ్ వైర్​తోపాటు ఇతర సామగ్రిని సైతం దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకున్నారు.

అలాగే ఎలక్ట్రికల్ కట్టర్లతో హార్డ్ డిస్క్‌ను ధ్వంసం చేసినప్పుడు వెలువడిన అల్యూమినియం పొడినీ సేకరించారు. ఈ పొడిని ఫోరెన్సిక్ ల్యాబ్(Forensic Lab)​లో విశ్లేషించడం ద్వారా కీలక సాక్ష్యంగా మలిచే పనిలో నిమగ్నమయ్యారు. సీసీటీవీ ఫుటేజీ లాగ్‌ ప్రింట్లనూ దర్యాప్తు బృందం సేకరించింది. ఆధారాల ధ్వంసం సమయంలో సీసీ కెమెరాలను ఆఫ్ చేసిన నేపథ్యంలో ఆ సమయాన్ని నిరూపించేందుకు లాగ్ ప్రింట్లు సైతం కీలక ఆధారాలు కానున్నాయి.

తెరపైకిఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ ఫామ్ హౌజ్‌లో చోటు చేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అప్పట్లో ఈ వ్యవహారాన్ని పసిగట్టి ఉంటారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫామ్ హౌజ్‌లో ముందుగానే సీసీ కెమెరాలు, హియరింగ్ డివైజ్లను అమర్చిన వ్యవహారం, రాధాకిషన్‌ రావు(Radhakishan Rao) పర్యవేక్షణలోనే జరిగిందనే ప్రచారంపై దర్యాప్తు బృందం తాజాగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకిషన్‌రావు తమ కస్టడీలోనే ఉండటంతో ఈ అంశంపై విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

తొలిరోజు ముగిసిన రాధాకిషన్‌రావు కస్టడీ - విభిన్న కోణాల్లో పోలీసుల విచారణ - phone tapping case updates

టెలిగ్రాఫ్​ చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే చర్యలు తప్పవు - ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు - LOK SABHA eLECTIONS 2024

ABOUT THE AUTHOR

...view details