తెలంగాణ

telangana

ETV Bharat / state

పంటి నొప్పి చికిత్స కోసం వెళ్తే - ఉన్న ప్రాణం పోయింది! హైదరాబాద్​లో యువకుడి అనుమానాస్పద మృతి - Young Man Died FMS Dental Clinic

Person Died Suspicious in Hyderabad : హైదరాబాద్​లోని ఓ క్లినిక్​లో దంత చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Lakshmi Narayana Suspicious Death Case
Person Died Suspicious in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 4:01 PM IST

Person Died Suspicious in Hyderabad: హైదరాబాద్​లో ఓ వ్యక్తి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే, అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ వ్యక్తి దంత చికిత్స చేసుకోడానికి వెళ్లాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్​ 37లో ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ (FMS International Dental Clinic)​లోకి లక్ష్మీ నారాయణ (28) దంత చికిత్స కోసం వెళ్లాడు. కాసేపటికి ఆ యువకుడ్ని దగ్గరల్లో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మృతి చెందాడని తెలిపారు.

అగ్గిపెట్టె కోసం ఘర్షణ - బీరు సీసాతో కొట్టడంతో యువకుడు మృతి

Lakshmi Narayana Suspicious Death Case : లక్ష్మీ నారాయణ మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పంటి వైద్యం కోసం వచ్చిన లక్ష్మీ నారాయణకు డాక్టర్లు మత్తు మందు ఎక్కువగా ఇచ్చారని ఆరోపించారు. అనంతరం యువకడు స్పృహ కోల్పోయాడని తెలిపారు. దీంతో ఆ యువకుడ్ని వెంటనే ఆ ఆస్పత్రి నుంచి అపోలోకి తరలించారని పేర్కొన్నారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మార్గమధ్యలోనే చనిపోయినట్లు నిర్ధారించారని చెప్పారు.

పంటి నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల మా కుమారుడు చనిపోయాడు. మత్తు మందు ఎక్కువగా ఇవ్వడంతో స్పృహ కోల్పోయాడు. దీంతో వేరే ఆస్పత్రికి వెళ్తే, అక్కడి డాక్టర్లు చనిపోయినట్టు చెప్పారు. దీనికి కారణమైన వారిని శిక్షించాలి.- యువకుడి తండ్రి

ట్రాక్టర్​తో స్టంట్స్- చక్రాల కిందపడి అక్కడికక్కడే యువకుడు మృతి

Young Man Died in FMS International Dental Clinic Hyderabad : వైద్యుల నిర్లక్ష్యం వల్లే యువకుడు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. అనస్తేషియా డోస్(Anesthesia Dose) అధిక మోతాదులో ఇవ్వడం వల్ల మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఆ యువకుడు ఎలా చనిపోయాడు? డాక్టర్ల నిర్లక్ష్యమా? అసలు ఏం జరిగింది అనే కోణంలో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. తదుపరి విషయాలు దర్యాప్తు అనంతరం తెలియజేస్తామని తెలిపారు.

'నీ పెళ్లికి పెట్టిన ఖర్చులు తిరిగిచ్చేయ్' - అన్నా వదినల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details