Anakapalli People Suffered due to Damaged Bridges :గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక వంతెనలు శిథిలమై ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. వాటికి మరమ్మతులు చేపట్టలేదు. దీంతో అవి పూర్తిగా శిథిలమయ్యాయి. కానీ వాటి స్థానంలో కొత్తవి నిర్మించడంపైనా వైఎస్సార్సీపీ సర్కార్ దృష్టి పెట్టలేదు. దీంతో వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రమాదం అంచున ప్రయాణం చేయాల్సి వస్తోంది. కొన్ని చోట్ల బ్రిటీష్ కాలంలో నిర్మించిన వంతెనలపైనే ఇంకా రాకపోకలు సాగుతున్నాయి. ఏ క్షణంలో ఏ వంతెన కూలుతుందో అన్నట్టు పరిస్థితి తయారైంది.
Narsipatnam-Bheemili Road Damage : అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం - భీమిలి ప్రధాన రాష్ట్ర రహదారిపై ఉన్న రెండు ప్రధాన వంతెనలు కూలిపోయాయి. సాధారణంగా బ్రిడ్జి శిథిలమవుతున్న దశలోనే మరమ్మతులు చేయించడం, లేదా కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సి ఉంది. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. వంతెన పూర్తిగా కూలిపోయిన తర్వాత ఆ శిథిలాలపై కాజ్‌వే నిర్మించి జగన్ సర్కార్ చేతులు దులుపుకుంది.
YSRCP Govt Neglet on Bridges : భీమునిపట్నం - నర్సీపట్నం బీఎన్ రోడ్‌లో విజయరామరాజుపేట వద్ద కూలిపోయిన వంతెన స్థానంలో నిర్మించిన తాత్కాలిక కాజ్‌వేలను నిర్మించింది. వీటిపై నిత్యం ప్రయాణం నరకప్రాయంగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. వడ్డాది వద్ద శిథిలమైన వంతెన స్థానంలో నాటి ప్రభుత్వం సిమెంట్ పైపులతో కాజ్‌వేను ఏర్పాటు చేసి మమ అనిపించింది. దీనికోసమే కోటిన్నరకుపైగా ఖర్చు చేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రమే. కూలిన భాగం వరకు రాళ్లు వేసి వదిలేశారు.