తెలంగాణ

telangana

ETV Bharat / state

ముషీరాబాద్​ను ముంచెత్తిన వరద - ఇళ్లలోకి చేరిన వర్షపునీరు - HYDERABAD FLOODS 2024

Hyderabad Rains Floods 2024 : కుండపోతగా కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం తడిసిముద్దైంది. భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. పాతబస్తీ చాంద్రాయణగుట్ట, బండ్లగూడ మధ్య రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు వాహనాలు రోడ్డు మధ్యలో ఆగిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

People Face Problems with Hyderabad Rains Floods 2024
Hyderabad Rains Floods 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 1:39 PM IST

Updated : Aug 20, 2024, 2:25 PM IST

Musheerabad Floods 2024 : హైదరాబాద్​లో కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గం లోని అనేక లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి. వరద నీటిలో రామ్​నగర్ వినోబా కాలనీ ప్రాంత నివాసి వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. తెల్లవారుజామున 5:30 నుంచి ఏకధాటిగా వర్షం రావడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వెనుక వైపు నుంచి భారీ వరద నీరు వచ్చి చేరింది. దీంతో బాపూజీనగర్, రాంనగర్, వినోబకాలనీ, గంగపుత్ర కాలనీ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధానంగా 8 అడుగుల ఎత్తు వరకు వరద నీరు రావడంతో రెండు కార్లు, ద్విచక్ర వాహనాలు ఆ వరద నీటిలో కొట్టుకుపోయాయి.

వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి : పార్శీగుట్ట వినోబా కాలనీలో ఉంటున్న ఒక వ్యక్తి వరద వస్తున్న సమయంలో బయటకు వచ్చారని ఆ వరద నీటిలో కొట్టుకుపోయారని స్థానికులు తెలిపారు. 20 ఏళ్ల క్రితం కూడా ఇదే విధంగా వరద నీరు వచ్చిందని గుర్తు చేశారు. వరద వెళ్లడానికి సులువుగా మార్గాలు లేని కారణంగానే 10 అడుగుల మేర నీరు ప్రవహిస్తుందని స్థానికులు ఆరోపించారు. ముఖ్యంగా నగరంలోని మురుగు, వరద నీటి వ్యవస్థను ప్రతి వర్షాకాలంలో మెరుగుపరచని కారణంగానే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు.

హైదరాబాద్​లో మరో రెండ్రోజులు వర్షాలు - సిబ్బందికి సెలవులు రద్దు చేసిన జలమండలి - Heavy Rains in Hyderabad Today

పాతబస్తీలో పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు : మరోవైపు హైదరాబాద్ పాతబస్తీలో పలు ప్రాంతాల్లో నాళాలు ఉద్ధృతంగా ప్రవహించి, రోడ్లపై భారీగా నీరు చేరడంతో రాకపోకలకు భారీగా అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట బండ్లగూడ మధ్య రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు వాహనాలు రోడ్డు మధ్యలో ఆగిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బహదూర్​పురా వద్ద భారీగా నీరు రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడా, గంగానగర్, ఛత్రినాకా ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు రోడ్డుపై రావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

"భారీ వర్షం కురవడంతో ఇళ్లలోకి మురికి నీరు వచ్చాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.వరద నీరు వెళ్లడానికి మార్గాలు లేని కారణంగా రోడ్లు చెరువుల్లా మారాయి. దీంతో బయటికి పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం పట్టించుకుని మురుగునీరు ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి." - బాధితులు

భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలం - నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు - Heavy Rains in Hyderabad

Last Updated : Aug 20, 2024, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details