ETV Bharat / state

ఒకే రోజు గ్రూప్​-2, ఆర్​ఆర్​బీ జేఈ పరీక్షలు - ఆందోళనలో అభ్యర్థులు - JOB INFORAMATION NEWS

ఆందోళనలో అభ్యర్థులు - ఒకేరోజు గ్రూప్​-2, ఆర్​ఆర్​బీ జేఈ పరీక్షలు - పరీక్షల తేదీలు మార్చాలని టీజీపీఎస్సీ, రైల్వే బోర్డును కోరుతున్న అభ్యర్థులు

Education News
Education News (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2024, 9:46 PM IST

Group 2 Exam Update : తెలంగాణలో గ్రూప్​-2 పరీక్ష ఒకవైపు, రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు పరీక్ష మరోవైపు. అయితే ఆ రెండు పరీక్షల తేదీలు ఒకే రోజు పడ్డాయి. దీంతో అభ్యర్థులు ఒకే రోజు రెండు పరీక్షల నిర్వహణ ఉండటంతో ఏ పరీక్ష రాయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(టీజీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్​ -2 పరీక్షలు డిసెంబరు 15, 16 తేదీల్లో జరగ్గా.. అదే డిసెంబరు 16వ తేదీన ఆర్​ఆర్​బీ జూనియర్​ ఇంజినీర్ పోస్టులకు పరీక్ష జరగనుంది.

దీంతో ఈ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏ పరీక్ష రాయాలో అనే గందరగోళంలో పడ్డారు. గ్రూప్​-2కు హాజరయ్యే అభ్యర్థుల్లో కొందరు ఆర్​ఆర్​బీ జేఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్​-2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల్లో కొందరు ఆర్​ఆర్​బీ జేఈ పరీక్షలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని వాపోయారు. రెండు పరీక్షల్లో ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని రైల్వే శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు.

తెలంగాణ గ్రూప్​ -2 పరీక్షల షెడ్యూల్​ విడుదల : నవంబరు 21వ తేదీన టీజీపీఎస్సీ గ్రూప్​ -2 పరీక్షల షెడ్యూల్(టైం టేబుల్​)​ను విడుదల చేసింది. ఈ పరీక్షలు డిసెంబరు 15, 16 తేదీల్లో జరగనున్నాయి. డిసెంబరు 9 నుంచి 15వ తేదీ వరకు హాల్​ టికెట్ల డౌన్​లోడ్​కు అవకాశం కల్పించారు. ఈ పరీక్షలు రెండు రోజుల పాటు రెండు షిప్ట్​లలో జరగనున్నాయి. ఇందులో డిసెంబరు 15వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్​ -1 పరీక్ష ఒక షిఫ్ట్​ జరగ్గా.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మరో షిఫ్ట్​ పరీక్ష పేపర్​ -2 జరగనుంది. అలాగే డిసెంబరు 16వ తేదీన ఉదయం పేపర్​-3, మధ్యాహ్నం పేపర్​-4 పరీక్ష జరగనుంది.

ఆర్​ఆర్​బీ జేఈ పరీక్షల షెడ్యూల్​ : 7951పోస్టులకు ఆర్​ఆర్​బీ జేపీ పరీక్ష జరగనుంది. ఈ జేఈ పరీక్ష డిసెంబరు 13 నుంచి 17వ తేదీ వరకు జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను కూడా ఆర్​ఆర్​బీ ప్రకటించింది.

గ్రూప్​ -2 రాత పరీక్షలు - టైం టేబుల్​ విడుదల చేసిన టీజీపీఎస్సీ

నిరుపేద కుటుంబంలో పుట్టిన యువతి - 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కైసవం - Chandrakala Gets 3 Central Jobs

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.