People Committing Frauds by Pawning Cars in Kadapa :సులువైన మార్గంలో డబ్బులు సంపాదించడంపై కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. కొత్త పంథాలు వెతుకుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. చివరకు అడ్డంగా దొరికి జైళ్లో ఊచలు లెక్కపెడుతున్నారు. తాజాగా కడపలో కార్లను కుదవ పెట్టి చీటింగ్ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కార్లను కుదవ పెట్టి మోసగిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు దాదాపు 2 కోట్ల రూపాయలు విలువచేసే 26 వాహనాలను పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే కడప నబికోట చెందిన శశిధర్రెడ్డి, జిలాని భాష అనే ఇద్దరు కార్ల యజమానుల వద్దకు వెళ్లి కార్లను నెలరోజుల పాటు అద్దెకి ఇవ్వాలని అడుగుతారు. నెలకు 30,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెబుతారు. యజమానులు నమ్మకంతో కార్లను అద్దెకిస్తారు. 2 లేదా 3 నెలల పాటు క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తారు. ఇక నాలుగో నెల వచ్చేసరికి అద్దె చెల్లించరు. దీంతో కార్ల యజమాని వచ్చి అద్దె ఇవ్వలేదు, కార్లు వెనక్కి ఇవ్వాలంటూ అడుగుతారు. కార్లు లేవు కుదవపెట్టామని చెప్పేస్తారు.
ఆ 1500 మందికి ATMలా బల్దియా - పని చేయకుండానే నెలనెలా జీతాలు - No Work But Taking Salary in GHMC